‘ఇస్మార్ట్ శంకర్' తో మళ్ళీ హిట్ ట్రాక్ లోకి వచ్చిన రామ్ ఈ సినిమా సూపర్ సక్సస్స్ సాధించినా ఈమూవీ సక్సస్స్ టూర్ లో కనిపించకుండా పోతు ఉండడంతో అతడి అభిమానులకు కూడ సమాధానం లేని ప్రశ్నగా మారింది. వాస్తవానికి రామ్ యూరప్ లో హాలీడే ట్రిప్ ను ఎంజాయ్ చేస్తున్నాను అంటూ క్లారిటీ ఇచ్చినా కనీసం ఈమూవీ యూనిట్  ప్రస్తుతం కొనసాగిస్తున్న సక్సస్స్ టూర్ లో కూడ కనిపించక పోవడం ఒక వెలితిగా మారింది. 

ఈ మూవీ భారీ సక్సస్ తో పూరి జగన్నాధ్ ఛార్మీ మణిశర్మ ఇలా అందరికీ కరువు తీరిపోయింది. సినిమా బ్లాక్ బస్టర్ అని ఇప్పటికే ట్రేడ్ లెక్కలు చెబుతున్నాయి. దీనితో రామ్ త్వరలో నటించబోయే సినిమా ఏ దర్శకుడితో ఉంటుంది అంటూ అప్పుడే అంచనాలు మొదలైపోయాయి. ఇలాంటి పరిస్థితులలో రామ్ పై రామ్ గోపాల్ వర్మ దృష్టి పడినట్లు వార్తలు వస్తున్నాయి.    

రామ్ కు తన శిష్యుడు పూరి మేకోవర్ ఇచ్చినట్టే తను కూడా ఒక స్పెషల్ మేకోవర్ ను ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ తో రామ్ తో సినిమాచేయాలని ప్రయత్నిస్తూ ఈ విషయమై రాయబారాలు చేసే భాద్యతను వర్మ ఛార్మీకి అప్పచెప్పినట్లు తెలుస్తోంది. వాస్తవానికి వర్మ తన ఫామ్ ను కోల్పోయి కొన్నేళ్ళు అయింది.  'లక్ష్మీస్ ఎన్టీఆర్' లాంటి వివాదాస్పద సినిమాను తీసినా ఆ సినిమాకు సక్సస్స్ రాలేదు అన్నది వాస్తవం. 
 
రామ్ పూరితో 'ఇస్మార్ట్ శంకర్'  కు ఒప్పుకునేముందు అనేక ఆలోచనలు చేసాడు అని అంటారు. ఒక లాటరీ టికెట్ లా ఈ సినిమాను చేసాను అంటూ రామ్ స్వయంగా ఈ మూవీకి సంబంధించిన ఇంటర్వ్యూలో చెప్పి షాక్ ఇచ్చాడు. ఇలాంటి పరిస్థితులలో ఛార్మీ ఎన్ని రాయబారాలు చేసి ఎన్ని భారీ ఆఫేర్లు ఇచ్చినా రామ్ బుట్టలో పడతాడా అన్నదే ప్రశ్న.. 



మరింత సమాచారం తెలుసుకోండి: