ఒకప్పుడు మణిశర్మ సినిమాలకు ఎంత క్రేజ్ ఉండేదో చెప్పక్కర్లేదు.  వరసగా హిట్స్ కొట్టేవాడు.  ప్రతి ఆల్బమ్ మ్యూజికల్ హిట్ అయ్యేది.  గత కొంతకాలంగా ఈ రేస్ లో బాగా వెనకబడ్డాడు.  బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అవకాశాలు కూడా తగ్గిపోయాయి.  ఈ ప్లేస్ లోకి దేవిశ్రీ, తమన్ ను ఆక్రమించారు.  


అయితే, మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఇస్మార్ట్ శంకర్ సినిమాతో తిరిగి లైన్లోకి వచ్చాడు.  శంకర్ ఆల్బమ్ ఇస్మార్ట్ హిట్ అయ్యింది. ఆల్బమ్ తో పాటు సినిమా కూడా బంపర్ హిట్.  బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో మరోసారి మాయచేశాడు మణిశర్మ.  ఈ మూవీ హిట్ తో తనలో సత్తా తగ్గిపోలేదని నిరూపించుకున్నాడు.  


ఇప్పుడైతే మణిశర్మ మరలా లైన్లోకి వచ్చాడో.. అప్పుడే ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్ల స్థానాలపై ఎసరు పడింది.  మణిశర్మ ఇచ్చే మ్యూజిక్ ఎదో అలా వచ్చి ఇలా వెళ్లిపోయేదిలా ఉండదు.  అది స్లో పాయిజన్ లాంటిది.  నిషా అలా ఎక్కుతూనే ఉంటుంది.  


ఇప్పుడు ఇక్కడ కూడా అదే జరుగుతున్నది.  ఇస్మార్ట్ శంకర్ మూవీ సాంగ్స్ మెల్లిగా ఎక్కుతున్నాయి.  ఇదిలా ఉంటె, ఇస్మార్ట్ శంకర్ హిట్ తరువాత మణిశర్మకు మరో పెద్ద ప్రాజెక్ట్ వచ్చిందని తెలుస్తోంది. ఆ ప్రాజెక్ట్ ఏంటి అన్నది త్వరలోనే తెలుస్తుంది.  ఒకవేళ అది కూడా హిట్టయితే.. మణిశర్మ శకం తిరిగి ప్రారంభమైనట్టే.  


మరింత సమాచారం తెలుసుకోండి: