శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన ఆనందం సినిమాతో హీరోగా హిట్ కొట్టాడు నటుడు ఆకాశ్. ఆ తరువాత ఆకాశ్ తెలుగులో చాలా సినిమాల్లో హీరోగా నటించినప్పటికీ ఆ సినిమాలేవీ సక్సెస్ కాలేదు. ఆకాశ్ క్యారక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన కొన్ని సినిమాలు మాత్రం హిట్ అయ్యాయి. ఆకాశ్ తను నటించిన అందాల రాముడు సినిమా గురించి మాట్లాడుతూ ఒక ముసలావిడ అందాల రాముడు సినిమా చూసి తనకు ఫోన్ చేసిందని ఎందుకు ఇలాంటి క్యారక్టర్ చేసావని అడిగిందని ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆకాశ్ చెప్పాడు. 
 
తాను అందాల రాముడు సినిమాలో నటించడానికి కారణం హీరో సునీల్ అని తాను పిలుస్తే పలుకుతా అనే సినిమా చేస్తున్నపుడు తనతో ఒక సినిమాలో స్పెషల్ రోల్ లో నటించాలని సునీల్ మాట తీసుకున్నాడని ఒకరోజు సునీల్ ఫోన్ చేసి భయ్యా! నేను హీరోగా అందాల రాముడు సినిమా చేస్తున్నాను. అందాల రాముడు సినిమాలో సెకండ్ హీరో పాత్ర తాను చేయాలని, ఈ సినిమాలో సెకండ్ హీరో పాత్ర అందంగా ఉంటుందని అన్నాడని అంతేకాక అందాల రాముడు షూటింగ్ సమయంలో ఈ పాత్రలో నటిస్తున్నందుకు చాలా థాంక్స్ అని సునీల్ అన్నాడని ఆకాశ్ చెప్పారు. సునీల్ కు మాటిచ్చినందుకు తమిళంలో హీరోగా నటించాల్సిన సినిమా ఒకటి వదులుకొని అందాలరాముడు సినిమాలో నటించానని ఆకాశ్ చెప్పాడు. 
 
ఆకాశ్ మాట్లాడుతూ అందాల రాముడు సినిమా సక్సెస్ అయిన తరువాత మాత్రం నా గురించి సునీల్ ఒక్క ఇంటర్వ్యూలో కూడా చెప్పలేదు. ఒక్క పోస్టర్లో కూడా నా ఫోటో పెట్టలేదు. ఆ తరువాత సునీల్ నేను కలిసి నవ వసంతం సినిమా చేసే సమయంలో నన్ను చిన్న చూపు చూసాడు. ఆ తరువాత ఢీ సినిమా ప్రమోషన్లలో మాత్రం తన కోసమే అందాల రాముడు సినిమాలో నటించానని శ్రీను వైట్ల గారితో చెప్పాడని ఆకాశ్ అన్నాడు. 



మరింత సమాచారం తెలుసుకోండి: