విజ‌య్ దేవ‌ర‌కొండ - ర‌ష్మిక మంద‌న్న జంట‌గా న‌టిస్తోన్న సినిమా డియ‌ర్ కామ్రేడ్. వీరి కాంబోలో వ‌చ్చిన గీతగోవిందం సినిమా సూప‌ర్ హిట్ అవ్వ‌డంతో... విజ‌య్‌కు యూత్లో తిరుగులేని క్రేజ్ ఉండ‌డంతో డియ‌ర్ కామ్రేజ్‌కు అడ్వాన్స్ బుకింగ్స్ ఓ రేంజులో ఉన్నాయి. ఇక ర‌ష్మిక విజ‌య్‌కు హిట్ ఫెయిర్ కావ‌డంతో డియ‌ర్ కామ్రేడ్‌కు వ‌ర‌ల్డ్ వైడ్‌గా ఏకంగా రూ.34 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జ‌రిగింది.


ఇది టైర్ 2 స్టార్ హీరోగా ఉన్న విజ‌య్‌కు పెద్ద టార్గెట్టే. నైజాంలోనే రూ.9 కోట్ల‌కు ఈ సినిమా అమ్ముడైంది. ఇక వ‌ర‌ల్డ్ వైడ్‌గా రూ.70 కోట్ల పైచిలుకు గ్రాస్ వ‌సూళ్లు వస్తేనే ఈ సినిమా బ్రేక్ ఈవెన్‌కు వ‌స్తుంది. భ‌ర‌త్ క‌మ్మ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమా మైత్రీ మూవీస్ బ్యాన‌ర్‌పై తెర‌కెక్కింది. ఏరియాల వారీగా ఈ సినిమా బిజినెస్ ఇలా ఉంది.


డియ‌ర్ కామ్రేడ్ ఏరియా వైజ్‌ ప్రీ రిలీజ్ బిజినెస్: (రూ.కోట్ల‌లో)


నైజాం - 9.00


సీడెడ్ - 3.60


ఉత్త‌రాంధ్ర‌ - 2.40


ఈస్ట్ గోదావరి - 1.80


కృష్ణ - 1.60


గుంటూరు - 2.00


వెస్ట్ గోదావరి - 1.40


నెల్లూరు - 0.80
------------------------
ఏపీ /టీస్ = 22.60
---------------------

ఇతర ప్రాంతాలు 8.00


ఓవర్సీస్ 4.00
-------------------------------------- 
టోటల్ వరల్డ్ వైడ్ = 34.60 కోట్లు
--------------------------------------


మరింత సమాచారం తెలుసుకోండి: