అత్యంత భారీ అంచనాలతో ప్రపంచ వ్యాప్తంగా నాలుగు భాషలలో విడుదలైన ‘డియర్ కామ్రేడ్’ మూవీని చూసిన ఓవర్సీస్ ప్రేక్షకులు వ్యక్తపరుస్తున్న అభిప్రాయాలు కొంతవరకు విజయ్ అభిమానులకు షాక్ ఇచ్చే విధంగా ఉన్నట్లు సమాచారం వస్తోంది. ఈమూవీలో మొదటి 25 నిముషాలు చివరి 5  నిముషాలు తప్ప మిగతా సినిమా అంతా బోర్ అంటూ కొందరు ఓవర్సీస్ ప్రక్షకుల అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు.

మరి కొందరైతే ఈమూవీ చూసిన వారికి గతంలో నాని నటించిన ‘ఎటో వెళ్ళి పోయింది మనసు’ మూవీలా ఉందని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. ఇక ఈమూవీ ఓవర్ ఆల్ గా చాల స్లోగా నడవడంతో క్లాసీ మూవీ అని అనిపిస్తుంది కాని మాస్ ప్రేక్షకులకు కనెక్ట్ కావడం కష్టం అని అంటున్నారు. 

అయితే ఈమూవీకి పెరిగిన రన్ టైమ్ శాపంగా మారిందని ఈమూవీని ఒక గంట ముప్పై నిముషాలలోపు ఎడిట్ చేసి ఉంటే ప్రేక్షకులకు అసహనం ఉండేది కాదని కామెంట్స్ వస్తున్నాయి. అంతేకాదు అసలు ఈ సినిమాను నాలుగు భాషలలో విడుదల చేయాలి అన్న ఆలోచన ఎందుకు వచ్చింది అని ప్రశ్నిస్తూ అంత గొప్పతనం ఈమూవీ కథలో ఏమి ఉంది అంటూ ఈమూవీ చూసిన ఓవర్సీస్ ప్రేక్షకులు నిట్టూర్పులు విడుస్తున్నారు. 

అయితే విజయ్ దేవరకొండ ఓవర్సీస్ అభిమానులు మటుకు ఈమూవీ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం ఖాయం అంటూ ఈమూవీ చూసిన తరువాత సోషల్ మీడియాలో ట్విట్స్ హంగామా మొదలు పెట్టేసారు. అందుతున్న ప్రాధమీక సమాచారం బట్టి ‘డియర్ కామ్రేడ్’ డీసెంట్ మూవీగా మారుతుంది కాని బ్లాక్ బస్టర్ హిట్ అయ్యే ఆస్కారం లేదు అన్న సంకేతాలు వస్తున్నాయి. అయితే ఇది అంతా ప్రాధమీక వార్తలు కాబట్టి తెలుగు రాష్ట్రాల ప్రేక్షకుల తీర్పును బట్టి ఈమూవీ ఏ స్థాయిలో విజయ్ దేవరకొండకు విజయాన్ని ఇస్తుందో తెలుస్తుంది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: