ఆంధ్రప్రదేశ్ కు జరిగిన ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి ఘోర ఓటమి ఎదురైనా బాలకృష్ణ హిందూపురం నుండి గెలవడం తెలుగుదేశ వర్గాలనే ఆశ్చర్య పరిచింది. అంత నెగిటివ్ వేవ్ లో నెగ్గిన బాలయ్య ప్రస్తుతం చాల వాడివేడిగా జరుగుతున్న ఆంద్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలలో కనిపించకపోవడం చాలామంది రాజకీయ ప్రముఖులతో పాటు బాలయ్య అభిమానులను కూడ ఆశ్చర్య పరుస్తోంది. 

ఇక లేటెస్ట్ గా తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు కీలక అసెంబ్లీ సభ్యులను మొన్న అసెంబ్లీ నుండి సస్పెండ్ చేయడంతో ఈ అన్యాయాన్ని నిరశిస్తూ నిన్న అసెంబ్లీకి పాదయాత్రగా తెలుగుదేశం ఎమ్.ఎల్.ఏ. లు అంతా నినాదాలు చేసుకుంటూ వచ్చారు. ఈ కీలక ఘట్టంలో కూడ బాలకృష్ణ కనిపించలేదు. దీనితో బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ విషయాలలో బిజీగా ఉంటూ అసెంబ్లీ సమావేశాలకు డుమ్మా కొడుతున్నాడా? లేదంటే మరేదైనా కారణం ఉందా అంటూ చర్చలు జరుగుతున్నాయి. 

వాస్తవానికి తెలుగుదేశం పార్టీ ఓటమిని బాలకృష్ణ జీర్ణించుకోలేకపోతున్నాడు అంటూ ఇప్పటికే రకరకాల వార్తలు హడావిడి చేస్తున్నాయి. దీనికితోడు కొందరు నందమూరి అభిమానులు బాలకృష్ణకు తెలుగుదేశం పార్టీ నాయకత్వం అప్పగించాలి అని వచ్చిన డిమాండ్ పై కూడ బాలయ్య ఏవిధంగాను స్పందించలేదు. 

ప్రతిపక్ష హోదా నిలుపుకునే కనీస సంఖ్యలో ఎమ్.ఎల్.ఏ. లు కూడ లేని తెలుగుదేశం పార్టీకి ప్రస్తుతం ప్రతి అసెంబ్లీ సభ్యుడు ఒక పదిమందితో సమానంగా కనిపిస్తున్నాడు. ఇలాంటి కీలక సమయంలో కూడ బాలకృష్ణ అసెంబ్లీ సమావేశాల పట్ల ఎందుకు ఉదాసీనంగా కనిపిస్తున్నాడు అంటూ బాలయ్య వీరాభిమానులు కూడ తమ హీరో స్ట్రాటజీలు అర్ధం అవ్వక తల పట్టుకుంటున్నట్లు టాక్..    


మరింత సమాచారం తెలుసుకోండి: