టాలీవుడ్ లో ఈ ఏడాది జెర్సీ అనే ఎమోషన్ స్పోర్ట్స్  డ్రామాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మనసు గెలుచుకున్న నేచురల్ స్టార్ నాని ఇప్పుడు గ్యాంగ్ లీడర్ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. విక్రమ్ కె.కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా టీజర్ ఇప్పటికే రిలీజ్ అయింది. ఐదుగురు చుట్టూ తిరిగే కథాంశంగా గ్యాంగ్‌లీడర్ క‌థ ఉన్నా... స్క్రీన్ ప్లే మాత్రం చాలా కామెడీగా ఉంటుందని అర్థమవుతుంది. 


ఇదిలా ఉంటే ఈ సినిమాలో నాని పెన్సిల్ పార్థ‌సార‌థిగా కనిపించాడు. టీజ‌ర్‌తో పాటు ఇండ‌స్ట్రీలో ఈ సినిమా గురించి తెలిసిన వాళ్ళు ఈ సినిమాకు కృష్ణ గాడి వీర ప్రేమ సినిమాకు పోలీక‌లు ఉన్నాయని చెబుతున్నారు. లుక్ పరంగా కూడా రెండు సినిమాలలోనూ పక్కింటి అబ్బాయి తరహా పాత్ర పోషించిన నాని ‘కృష్ణ గాడి వీర ప్రేమ గాధ’ సినిమాలో కూడా ముగ్గురు పిల్లల్ని వెంటేసుకుని రోడ్ జర్నీ చేస్తాడు.


స్క్రీన్ ప్లే ప‌రంగా చూసినా కూడా రెండు సినిమాల‌కు మ్యాచ్ అవుతాయ‌ని కొంద‌రు డౌట్‌గా చెపుతున్నారు. రెండు సినిమాల్లో నాని లుక్స్ మాత్రం దాదాపు స‌రిపోయేలా ఉన్నాయి. విక్రమ్ కుమార్ తన కెరియర్ లో ఇప్పటిదాకా లేనటువంటి విధంగా ఎంటర్ టైనింగ్ సినిమాతో రాబోతున్నాడట. ఈ సినిమా త్వరలో విడుదల కాబోతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: