కృష్ణా నగర్లో శంకర్ పండుగ ఏంటి అని షాక్ అవ్వకండి.. ఇది పూరి ఇస్మార్ట్ శంకర్ పండుగ కాదు.  దర్శకుడు శంకర్ పండుగ.  అదేంటి అదెలా అనుకుంటున్నారా అక్కడికే వస్తున్నా... శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా భారతీయుడు 2 సినిమా చేస్తున్నారు.  


ఈ సినిమా షూటింగ్ ప్రారంభమయ్యి ఫస్ట్ షెడ్యూల్ కూడా కంప్లీట్ చేసుకుంది.  ఆ తరువాతే బడ్జెట్ సమస్యలు, కమల్ హాసన్ రాజకీయాల్లో బిజీ కావడంతో సినిమా పోస్ట్ ఫోన్ అయ్యింది.  కొంతమంది సినిమాను ఆపేశారని వార్తలు పుట్టించారు.  ఇదంతా అబద్దం అని తేలిపోయింది.  


ఆగష్టు నుంచి రెండో షెడ్యూల్ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ప్రారంభం కాబోతున్నది.  ఇంతకీ పండుగ ఏంటి అనుకుంటున్నారు కదా.  అదేమంటే.. శంకర్ భారతీయుడు 2 సినిమాలో నటించేందుకు నటీనటులు కావాలట.  నటనపై ఆసక్తి ఉన్న నటీనటులు తమ ప్రొఫైల్ మెయిల్ చేయాలని యూనిట్ యాడ్ ఇచ్చింది.  


మొదటిసారి శంకర్ ఇలా నటీనటులు కావాలని కోరారు.  శంకర్ సినిమాలో అవకాశం అంటే మాములు విషయం కాదుకదా.  కృష్ణానగర్ లో ఎంతోమంది పాపం వేషాల కోసం తురుగుతుంటారు.  అలాంటి వాళ్లకు శంకర్ పండుగ తీసుకొచ్చినట్టే.  ఏ పుట్టలో ఏ పాముందో ఎవరికి తెలుసు.  మీరు సెలక్ట్ కావొచ్చేమో.  ఆసక్తి ఉన్నవాళ్లు casting.indian2@gmail.com కు ప్రొఫైల్ పంపించండి.  


మరింత సమాచారం తెలుసుకోండి: