చేసే పనిపైనే పూర్తిస్థాయిలో దృష్టిపెడితే.. చుట్టూ ఏం జరుగుతున్నా పట్టించుకోము.  చేస్తున్న పని 100 కు వంద శాతం సక్సెస్ అవుతుందా అన్నదే చూస్తాం.  అందుకోసమే నటీనటులు నటించే సమయంలో దానిపైనే ఫోకస్ చేస్తారు.  మరో దానిపై మనసు వెళ్ళదు.  వెళ్ళలేదు కూడా.  


అందుకే వాళ్ళు సక్సెస్ అవుతుంటారు. ఇలాంటి సక్సెస్ స్టోరీస్ బాలీవుడ్ హీరోయిన్ మలైకా అరోరా డైరీలో ఎన్నో ఉన్నాయట.  అందులో ఒకదాన్ని ఆమె ఇటీవల రీవీల్ చేసింది.   షారుక్ ఖాన్ దిల్ సే సినిమా గుర్తుంది కదా.  దిల్ సే సినిమా అనగానే అందరికి గుర్తొచ్చేది.. చల్ సయ్యా సయ్యా సాంగ్.  


ఈ సాంగ్ లో మాలైనా అరోరా నటించింది.  ట్రైన్ పై సాంగ్ ను షూట్ చేశారు.  ట్రైన్ జర్నీలో ఉండగా సాంగ్ జరుగుతుంది.  ట్రైన్ మీద ఈ సాంగ్ చేయాలి.  అక్కడి నుంచి పడితే ఇంకేముండదు.  పైగా మలైకా అరోరా స్టెప్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి.  


దీంతో ఆమె పడిపోకుండా ఉండేందుకు నడుముకు తాడు కట్టి షూట్ చేశారట.  సాంగ్ చేస్తున్నంతసేపు తాడు నడుముకు ఉన్నది. పూర్తయ్యాక తాడు తీసేస్తే.. నడుము చుట్టూ బ్లడ్ ఉందట.  మలైకా డెడికేషన్ కు అదొక నిదర్శనం అని చెప్తుంటారు.  అందుకే 45 సంవత్సరాల వయసులో కూడా ఆమెకు ఇంకా బాలీవుడ్ లో అవకాశాలు వస్తూనే ఉన్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: