రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీయార్, రామ్ చరణ్ హీరోలుగా ఆర్ ఆర్ ఆర్ సినిమా షూటింగ్ జరుపుకుంటోన్న విషయం తెలిసిందే. ఈ సినిమా 2020 సంవత్సరం జులై 30వ తేదీన విడుదల కాబోతుంది. ఆర్ ఆర్ ఆర్ సినిమాలో ఎన్టీయార్ కొమరం భీమ్ పాత్రలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నారు. దాదాపు 350 కోట్ల బడ్జెట్తో డివీవి దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 
 
రామ్ చరణ్ కు హీరోయిన్ గా బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ ఫైనల్ కాగా ఎన్టీయార్ కు హీరోయిన్గా మొదట హాలీవుడ్ హీరోయిన్ డైసీ ఎడ్గర్ జోన్స్ ఎంపికయింది. కానీ కొన్ని రోజుల తరువాత కొన్ని అనివార్య కారణాల వలన ఆర్ ఆర్ ఆర్ సినిమాలో నటించట్లేదని డైసీ ఎడ్గర్ జోన్స్ ప్రకటించింది. మరో హీరోయిన్ కోసం రాజమౌళి చాలా రోజులు ఎందరో హీరోయిన్లను పరిశీలించాడు. చివరికి అమెరికాకు చెందిన ఎమ్మా రాబర్ట్స్ అనే హీరోయిన్ ఫైనల్ చేసాడు. 
 
కానీ ఎమ్మా రాబర్ట్స్ కూడా మొదట ఓకే చెప్పినా ప్రస్తుతం ఈ సినిమాలో నటించట్లేదని తెలుస్తుంది. ఇప్పటికే ఎన్టీయార్ కు జోడీ లేకుండా సినిమా కొంతభాగం షూటింగ్ పూర్తి చేసారు. త్వరలో ఆర్ ఆర్ ఆర్ సినిమా షూటింగ్ తమిళనాడు రాష్ట్రంలో జరగబోతుంది. రామ్ చరణ్ కు గాయం అవటంతో క్యాన్సిల్ అయిన పూణె షెడ్యూల్ తమిళనాడులో ప్లాన్ చేసాడు రాజమౌళి. తమిళనాడులో జూనియర్ ఎన్టీయార్ పై ఎక్కువ భాగం షూటింగ్ జరగబోతున్నట్లు తెలుస్తుంది. 


మరో హీరో రామ్ చరణ్ కొంతకాలం ఆర్ ఆర్ ఆర్ సినిమా షూటింగ్ కు బ్రేక్ తీసుకుని సైరాకు సంబంధించిన విషయాలపై దృష్టి పెడుతున్నట్లు సమాచారం అందుతుంది.ఎన్టీయార్ లాంటి స్టార్ హీరోకు రెండు సార్లు హీరోయిన్ ఫైనల్ అయ్యి మరలా సినిమాకు నో చెప్పటం వలన ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలుస్తుంది. అతి త్వరలో ఆర్ ఆర్ ఆర్ సినిమాలో ఎన్టీయార్ కు హీరోయిన్ ఫైనల్ కాకపోతే మాత్రం సినిమా అనుకున్న తేదీకి విడుదలవడం కష్టమే. 



మరింత సమాచారం తెలుసుకోండి: