ఆర్ ఆర్ ఆర్ సినిమాను ఏ ముహుర్తాన స్టార్ట్ చేశారోగాని అన్ని ఆటంకాలే ఎదురౌతున్నాయి.  ఫస్ట్ షెడ్యూల్ మొద‌లైన బాగానే జ‌రిగింది.  ఆ షెడ్యూల్ చివ‌ర్లో సినిమా యూనిట్ ను ప్ర‌క‌టించింది.  చ‌ర‌ణ్ కు అలియా భ‌ట్‌, ఎన్‌టీఆర్ కు డైసీని తీసుకున్నారు.  డైసీ బ్రిటీష్ హీరోయిన్‌. 

రెండో షెడ్యూల్ మొద‌ల‌య్యే ముందు... డైసీ సినిమా నుంచి త‌ప్పుకున్న‌ట్టుగా తెలిపింది. దీంతో హీరోయిన్ కోసం వేట మొద‌లు పెట్టాడు రాజ‌మౌళి.  ఇక‌, రెండో షెడ్యూల్ అనుకున్న స‌మ‌యంలో... చ‌ర‌ణ్ కాలు ఫ్యాక్చ‌ర్ కావ‌డంతో బ్రేక్ ఇచ్చారు.  చ‌ర‌ణ్ తో పాటు అదే స‌మయంలో ఎన్‌టీఆర్ కూడా గాయ‌ప‌డ్డారు. 

దీంతో పూణే షెడ్యూల్ క్యాన్సిల్ చేసి, హైద‌రాబాద్‌లోనే షెడ్యూల్ స్టార్ట్ చేశారు. షూటింగ్ మ‌ద్య‌లో రాజ‌మౌళి అమెరికా వెళ్లారు.  ఏదైనా ప‌ర్స‌న‌ల్ ప‌నిమీద వెళ్లారా అనుకుంటే... అదేంకాద‌ని తెలిసింది.  
ఎన్‌టీఆర్ కు హీరోయిన్ ను సెట్ చేయ‌డానికి అమెరికా వెళ్లార‌ట‌. 

హాలీవుడ్ హీరోయిన్ ఎమ్మా రాబ‌ర్ట్స్ ను ఆర్ ఆర్ ఆర్ సినిమాలో తీసుకోవ‌డానికి వెళ్లార‌ని తెలిసింది.  ఆర్ ఆర్ ఆర్ లో న‌టించేందుకు ఎమ్మా కూడా అంగీక‌రించిన‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి.  ఇంకేముంది... ఎమ్మా ఎవ‌రు అని తెలుసుకోవ‌డం కోసం తార‌క్ ఫ్యాన్స్ నెట్ ముందు వాలిపోయారు. 

జూలియా రాబ‌ర్ట్ మేన‌కోడ‌లు ఎమ్మా రాబ‌ర్ల్ అని కొంత స‌మాచారం. హైద‌రాబాద్ షెడ్యూల్ పూర్త‌యిన వెంట‌నే త‌మిళ‌నాడులో షూటింగ్ స్టార్ట చేయాలి.  ఈ లోగా మ‌రో న్యూస్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈ సినిమాలో న‌టించేందుకు రెడీగా ఉన్నా... బ‌ల్క్ లో డేట్స్ ఇవ్వాలంటే మాత్రం కుద‌ర‌ద‌ని చెప్పేసింద‌ట‌.  ఇందులో ఎంత వ‌ర‌కు నిజం ఉంది అన్న‌ది తెలియాలి.  అస‌లు ఎమ్మాను సినిమా కోసం అడిగారా లేదా... అమె అంగీక‌రించిందా లేదా అన్న‌ది తెలియ‌కుండా... ఇలా ప్ర‌చారం చేయ‌డం వ‌ల‌న నెగెటీవ్ ప‌బ్లిసిటి వ‌స్తుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: