నందమూరి హరికృష్ణ మొదట్లో తండ్రిబాటలోనే నడిచాడు.  తండ్రిలా సినిమాల్లో మెప్పించేందుకు ముఖానికి రంగు వేసుకున్నాడు.  చేసిన సినిమాలకు ఒక అర్ధం ఉండాలని చెప్పి సమాజానికి మంచి చెప్పే సినిమాలు చేసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపించాడు.  అలాంటి సినిమాలు చేయడానికి ఇష్టపడ్డాడు.  కెరీర్లో ఎన్నో సినిమాలు చేసిన హరికృష్ణ.. తన తండ్రి రాజకీయాల్లోకి రావడంతో.. తనుకూడా రాజకీయాల్లోకి వచ్చారు.  


తండ్రితో పాటు రాజకీయాల్లోనే తిరిగిగారు.. అయితే, మోహన్ బాబు శ్రీరాములయ్య సినిమాతో హరికృష్ణ తిరిగి సినిమా రంగంలోకి అడుగుపెట్టాడు.  అది పరిటాల రవి బలవంతం మేరకు.  శ్రీరాములయ్య సినిమాలో హరికృష్ణ సత్యం మాస్టర్ పాత్రను చేశారు.  మాస్టారుగా ఉన్న సత్యం.. నక్సలైట్ గా మరి కరపత్రాలు ఎలా అందజేశారు... నక్సలైట్ ఉద్యమానికి ఎలా ఊపిరి పోశారు అన్నది పాత్ర.  పరిటాల రవి బలవంతం మేరకు ఆ సినిమా చేశారు.  


ఈ సినిమా మంచి హిట్టైంది.  ఆ తరువాత సీతారామరాజు, సీతయ్య, రైతు సమస్యలపై పోరాటం చేసిన టైగర్ హరిచంద్ర ప్రసాద్ సినిమాలు చేశారు.  దీంతోపాటు వైవిఎస్ చౌదరి లాహిరి లాహిరి లాహిరిలో సినిమా చేశారు.  ఈ మూవీ సూపర్ హిట్టైంది.  దర్శకుడు వైవిఎస్ చౌదరికి మంచి పేరు తెచ్చిపెట్టింది.  చౌదరికి కాదు హరికృష్ణ పాత్రకు మంచి పేరు వచ్చింది.  


ఇందులో హరికృష్ణ ఓ సాహసం చేశారు.  అదేమంటే.. రైల్వే ట్రాక్ దగ్గర ఓ సీన్ ఉన్నది.  విలన్ జయప్రకాశ్ రెడ్డి కారు లైట్లు వేసుకుంటూ వస్తాడు.  హరికృష్ణ మాత్రం లైటు వేసినా ఆగకుండా వస్తాడు.  రెండుకార్లు రైల్వే ట్రాక్ పై ఆగిపోతాయి.  అదే సమయంలో దూరం నుంచి రైలు వస్తుంది.  దీంతో జయప్రకాశ్ రెడ్డి తన కారును వెనక్కి పోనిస్తాడు.  


హరికృష్ణ కారులో ఎక్కి స్టార్ చేయపోతే ఆ కారు స్టార్ట్ కాదు.  ఒకటికి రెండుసార్లు స్టార్ట్ చేశాక అప్పుడు స్టార్ట్ అవుతుంది.  కారును అలాగే ముందుకు పోనిస్తాడు.  కారు అలా ట్రాక్ దాటి ముందుకు వచ్చిందో లేదో.. ట్రైన్ అలా వెళ్ళిపోతుంది.  వెంట్రుక వాసిలో కారు రైలు నుంచి తప్పించుకుంది.  కారు దిగిన తరువాత మగాడు అన్న తరువాత తెగింపు ఉండాలి.  చావుకు మనం భయపడకూడదు.  చావే మనల్ని చూసి భయపడాలి... అని అన్నాడు.  హరికృష్ణ ధైర్యానికి అందరు ఫిదా అయ్యారట.  


మరింత సమాచారం తెలుసుకోండి: