దాదాపు 400 కోట్ల బడ్జెట్తో రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీయార్, రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కుతున్న చిత్రం ఆర్ ఆర్ ఆర్. ఈ సినిమాను 2020 జులై 30 వ తేదీన విడుదల చేయాలని రాజమౌళి భావించారు. ఈ సినిమాలో రామ్ చరణ్ కు హీరోయిన్ గా అలియా భట్ ఫైనల్ కాగా ఎన్టీయార్ హీరోయిన్ విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇప్పటికే ఇద్దరు హీరోయిన్లను ఎన్టీయార్ కోసం ఎంపిక చేసినా ఆ హీరోయిన్లు మొదట సినిమాకు ఓకె చెప్పి ఆ తరువాత సినిమా నుండి తప్పుకున్నారు. 
 
ఎన్టీయార్ కు హీరోయిన్ గా మొదట హాలీవుడ్ కు చెందిన డైసీ ఎడ్గర్ జోన్స్ ను ఎంపిక చేసారు. డైసీ మొదట సినిమాలో నటించటానికి ఓకె చెప్పినప్పటికీ ఆ తరువాత కొన్ని అనివార్య కారణాల వలన ఈ సినిమా నుండి తప్పుకుంది. ఆ తరువాత రాజమౌళి చాలా మంది హీరోయిన్లను పరిశీలించి అమెరికాకు చెందిన ఎమ్మీ రాబర్ట్స్ ను ఓకె చేసాడు. ఈమె కూడా ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకోలేదని తెలుస్తుంది. 
 
ఇలా హాలీవుడ్ హీరోయిన్లతో ఇబ్బందులు రావటం వలన రాజమౌళి ఈసారి కీర్తి సురేశ్ ను ఈ సినిమాలో ఫైనల్ చేయాలని నిర్ణయించాడట. మహానటి సినిమాతో కీర్తి సురేశ్ మంచి నటిగా ప్రూవ్ చేసుకుంది. అంతేకాక ఎన్టీయార్, కీర్తి సురేశ్ ఇప్పటిదాకా ఏ సినిమాలో కలిసి నటించలేదు. ఈ మేరకు కీర్తి సురేశ్ తో రాజమౌళి సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తుంది. 
 
ఆర్ ఆర్ ఆర్ సినిమాలో ఎన్టీయార్ కొమరం భీమ్ పాత్రలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నారు. టాలీవుడ్లో ఇప్పటిదాకా వచ్చిన మల్టీస్టారర్ సినిమాల్లో అతి పెద్ద మల్టీ స్టారర్ ఆర్ ఆర్ ఆర్ సినిమానే.ప్రీ రిలీజ్ బిజినెస్, శాటిలైట్, డిజిటల్ హక్కుల్లో ఆర్ ఆర్ ఆర్ సరికొత్త రికార్డులు సృష్టించబోతుందని తెలుస్తుంది. ఈ సినిమాను డీవీవి దానయ్య నిర్మిస్తున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: