300 కోట్ల భారీ బడ్జెట్ తో తీస్తున్న ‘ఆర్ ఆర్ ఆర్’ కు రెండు వందల కోట్ల బడ్జెట్ తో తీస్తున్న ‘కేజీఎఫ్ 2’ తో ఊహించని సమస్యలు రావడం రాజమౌళికి తలనొప్పిగా మారిందని టాక్. వచ్చే సంవత్సరం విడుదలయ్యే సినిమాలలో అత్యంత భారీ అంచనాలు ఉన్నవి ‘ఆర్ ఆర్ ఆర్’ ‘కేజీ ఎఫ్ 2’ లు మాత్రమే. 

‘ఆర్  ఆర్ ఆర్’ విడుదల తేదీని ఇప్పటికే రాజమౌళి అధికారికంగా ప్రకటించాడు. దీనితో ఈసినిమాతో క్లాష్ లేకుండా చూసుకోవాలని వచ్చే ఏడాది విడుదలకాబోయే భారీసినిమాలు అన్నీ తమ డేట్స్ ను చాల ముందుగానే ఎడ్జెస్ట్ చేసుకుంటున్నాయి. అయితే ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో వస్తున్న ‘కేజీఎఫ్ 2’ ‘ఆర్ ఆర్ ఆర్’ మ్యానియాను లెక్క చేయకుండా ఈసినిమాను కూడ సమ్మర్ రేస్ జూన్ లో విడుదల చేస్తున్నట్లు లీకులు ఇస్తున్నారు. 

దీనితో ‘ఆర్ ఆర్ ఆర్’ కంటే ముందుగా వచ్చే ‘కేజీఎఫ్ 2’ సమ్మర్ రేస్ కలక్షన్స్ ను చుట్టేస్తుందా అన్న సందేహాలు కలుగుతున్నాయి. ఈ సినిమాకు మెయిన్ విలన్ గా సంజయ్ దత్ నటిస్తూ ఉండటంతో ఈమూవీకి బాలీవుడ్ లో చాలమంచి హైక్ వచ్చింది. ఈ సినిమా చిత్రీకరణ ‘ఆర్ ఆర్ ఆర్’ లా ఎటువంటి సమస్యలు లేకుండా చాల వేగంగా పూర్తి అవుతోంది. 

ప్రస్తుతం కోలార్ మైన్స్ లో వేసిన భారీ సెట్స్ లో ఈమూవీ మూడో షెడ్యూల్ షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమా కోసం కోలార్ గనుల్ని పోలిన ఒక భారీ సెట్ వేసి ‘కేజీఎఫ్’ 1 కంటే విజువల్ గ్రాండియారిటీతో ఈమూవీ పార్ట్ 2ను తీస్తున్న పరిస్థుతులలో ఈమూవీలో ఉండే సీన్స్ అదేవిధంగా గ్రాఫిక్స్ అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.  ఈ పరిస్థుతులలో సమ్మర్ రేస్ ను టార్గెట్ చేస్తూ అతి తక్కువ గ్యాప్ లో విడుదల కాబోతున్న ‘కేజీఎఫ్ 2’ ‘ఆర్ ఆర్ ఆర్’ ల మధ్య గ్రాఫిక్స్ విషయంలో అదేవిధంగా యాక్షన్ సీన్స్ విషయంలో సగటు ప్రేక్షకుడు పోలికలు పెట్టి కామెంట్స్ చేసే ఆస్కారం ఉంది. దీనితో ‘కేజీఎఫ్ 2’ పోటీని దృష్టిలో పెట్టుకుని రాజమౌళి ‘ఆర్ ఆర్ ఆర్’ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని స్థిర నిర్ణయంలో ఉన్నట్లు టాక్..



మరింత సమాచారం తెలుసుకోండి: