యువ‌ర‌త్న నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం రాజకీయంగా కాస్త ఫ్రీగా మారడంతో తన నెక్ట్స్ మూవీ ప‌నుల్లో బిజి బిజీ అయ్యాడు. కోలీవుడ్ డైరెక్ట‌ర్ కేఎస్‌.ర‌వికుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కే ఈ సినిమాను సీ క‌ళ్యాణ్ నిర్మిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాకు రూల‌ర్ అనే టైటిల్‌ను ప‌రిశీలిస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి స్క్రిప్టు పనులు కూడా పూర్త‌య్యాయి.


ఈ సినిమాలో బాల‌య్య రెండు షేడ్స్ ఉన్న పాత్ర‌ల్లో నటిస్తున్నాడు. మొత్తం ముగ్గురు హీరోయిన్ల‌కు బాల‌య్య ప‌క్క‌న న‌టించే ఛాన్స్ ఉంద‌ట‌. చాలా మందిని వెతికి వెతికి ఎట్ట‌కేల‌కు లెజెండ్‌, డిక్టేట‌ర్ సినిమాల్లో బాల‌య్య స‌ర‌స‌న న‌టించిన సోనాల్ చౌహాన్‌ను ప్ర‌ధాన హీరోయిన్గా ఎంపిక చేశారు. అలానే మరో హీరోయిన్ గా సుమంత్ హీరోగా నటించిన ‘దగ్గరగా దూరంగా’ ఫేమ్ వేదిక కూడా ఈ సినిమాలో రెండో హీరోయిన్ గా నటిస్తున్నట్టు సమాచారం.


ఇక ఇప్పుడు మూడో హీరోయిన్‌గా బొద్దుగుమ్మ లాంటి హీరోయిన్ సెలెక్ట్ అయ్యింద‌ట‌. ఇంత‌కు ఆ బొద్దుగుమ్మ ఎవ‌రో కాదు.. నమిత. గతంలో ఈమె బాలయ్య తో సింహ సినిమాలో నటించింది. అయితే రవికుమార్ సినిమాలో నమిత నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించనుందట. మరి ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాల్సిఉంది. ఇక ఈసినిమాపై బాలయ్య అంచనాలు పెంచుకున్నాడు. 


బొద్దు అందాలను ఆరబోయ‌డంలో త‌న‌కు తానే సాటి అయిన న‌మిత మొత్తానికి చాలా లాంగ్ గ్యాప్ త‌ర్వాత బాల‌య్య బాబుతో సెకండ్ ఇన్సింగ్ స్టార్ట్ చేస్తోంది. గ‌తంలో బాల‌య్య - న‌మిత కాంబినేష‌న్లో వ‌చ్చిన సింహా సినిమా ఎంత సూప‌ర్ డూప‌ర్ హిట్ అయ్యిందో తెలిసిందే. ఈ సినిమాలో సింహ‌మంటి చిన్నోడే సాంగ్ ఇప్ప‌ట‌కీ మాస్ ప్రేక్ష‌కుల‌ను ఓ ఊపు ఊపేస్తూ ఉంటోంది. మ‌రి ఈ సెకండ్ ఇన్సింగ్స్ అయినా ఆమెకు ఎంత వ‌ర‌కు క‌లిసొస్తుందో ?  చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: