టాలీవుడ్‌లో తొలి సారి పూరి జ‌గ‌న్నాథ్‌- రామ్ కాంబినేష‌న్లో వ‌చ్చిన సినిమా `ఇస్మార్ట్ శంక‌ర్‌`. ఈ సినిమాలో నభా నటేష్, నిధి అగర్వాల్ రామ్ స‌ర‌స‌న న‌టించారు. వ‌ర‌స ఫ్లాపుల్లో ఉన్న రామ్‌- పూరీ టీజర్లు, ట్రైలర్లు రిలీజ్ అయిన తర్వాతే పూరీ- రామ్‌ ట్రాక్ ఎక్కినట్టే కనిపించారు. జూలై 18న విడుద‌ల అయిన ఈ చిత్రం అదే క్రేజ్‌తో ముందుకు సాగింది. ఇస్మార్ట్ శంకర్ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. హిట్ కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్న పూరి మ‌రియు రామ్‌కు మంచి ఊర‌ట‌నిచ్చింది.


`ఇస్మార్ట్ శంక‌ర్` రిలీజ్ అయిన వారం రోజుల‌కు `డియ‌ర్ కామ్రేడ్‌` విడుద‌ల అయింది. ఒకటి పక్కా క్లాస్ అయితే.. మరొకటి పక్కా ఊరమాస్.. డియర్ కామ్రేడ్ బాక్స్ ఆఫీస్ వద్ద డీసెంట్‌గా పెర్ఫామ్ చేస్తుండగా.. ఇస్మార్ట్ శంకర్ రెండో వారంలోకి అడుగు పెట్టి వ‌సూళ్ల ప‌రంగా దూసుకుపోతోంది. ఇస్మార్ట్ శంకర్ సినిమా పూరీకి డబుల్ బ్లాక్ బస్టర్ ఇచ్చింది. ఈ కాలంలో డ‌బుల్ బ్లాక్ బ‌స్ట‌ర్ అంటే మామూలు విష‌యం కాదు.


ఈ సినిమాను త‌క్కువ బ‌డ్జెట్‌లోనే అమ్మి ఎక్కువ ల‌భాలు పొందారు.  నైజాంలో ఈ సినిమాను ఐదున్నర కోట్ల రేషియోలో ఇచ్చారు. రెండు వారాల్లో 12 కోట్ల రూపాయల షేర్ సాధించింది. అన్ని పోను 6 కోట్లు లాభం వ‌చ్చింది. గుంటూరు, ఈస్ట్ లాంటి ప్రాంతాల మినహా.. అన్ని ఏరియాల్లోనే ఇదే క్రేజ్ కంటిన్యూ చేసింది. మ‌రి 12 రోజుల వ‌సూళ్లు ఏరియా వారీగా ఎలా ఉన్నాయో చూద్దాం.


ప్రాంతం ప్రీ-రిలీజ్ బిజినెస్ 12 రోజుల షేర్


నైజాం - 5.50 - 12.55 


సీడెడ్ - 2.52 - 5 


ఉత్తరాంధ్ర - 1.40  - 3.48 


ఈస్ట్ - 1.05 - 1.83 


వెస్ట్ - 0.90 - 1.53 


గుంటూరు - 1.10 - 1.82 


నెల్లూరు - 0.48 - 0.96 


కృష్ణా - 0.95 - 1.82


మరింత సమాచారం తెలుసుకోండి: