యంగ్ హీరో  విజయ్ దేవరకొండ నటించిన 'అర్జున్ రెడ్డి' తెలుగులో ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. ఈ చిత్రాన్ని  'ఖబీర్ సింగ్' గా బాలీవుడ్ లో  రీమేక్ చేశారు. ఇటీవల విడుదలైన  ఈ చిత్రం  అక్కడ కాసుల వర్షం కురిపించింది. దాంతో  విజయ్ దేవరకొండ తదుపరి చిత్రాల ఫై ఫోకస్ పెట్టారు బాలీవుడ్ నిర్మాతలు.  అందులో భాగంగా విజయ్ నటించిన తాజా చిత్రం 'డియర్ కామ్రేడ్'  విడుదలకు కొద్దీ రోజుల ముందు స్పెషల్ వేయించుకొని మరి చూసాడు ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్. సినిమా ఆయనకు  విపరీతంగా  నచ్చడంతో  డియర్ కామ్రేడ్ ను హిందీ లో రీమేక్ చేయాలని  నిర్ణయించుకున్నారు.  

దాంతో ఈ చిత్రం యొక్క రీమేక్ రైట్స్ ను ఏకంగా  6 కోట్ల పెట్టి  సొంతం చేసుకున్నాడు కరణ్ జోహార్.  ఇప్పుడిప్పుడే స్టార్ హీరో గా ఎదుగుతున్న  విజయ్ దేవరకొండ సినిమాకు 6కోట్లంటే చాలా ఎక్కువే.  ఇక రీమేక్ రైట్స్ అయితే కొనుక్కునాడు కానీ కరణ్  తెలుగులో ఈ  సినిమాకు వస్తున్న రెస్పాన్స్ చూసి  షాక్ అయ్యాడట.  ఇటీవల విడుదలైన ఈచిత్రం  మొదటి మూడు రోజులు పర్వాలేదనిపించింది కానీ వీక్ డేస్ లో  తేలిపోతుంది. దాంతో ఈ సినిమా ప్లాప్ లిస్ట్ లో చేరిపోవడం ఖాయంగా కనిపిస్తుంది.  సినిమా మరి స్లో గా ఉండడం తో ప్రేక్షకులు పెదవి విరిస్తున్నారు.   సినిమాను  గట్టెక్కించడానికి విజయ్ చేస్తున్న ప్రయత్నాలు  కూడా ఫలించడం లేదు.  

దాంతో ఇప్పుడు ఈసినిమాను హిందీలో రీమేక్ చేయాలా వద్దా అన్న డైలమాలో పడిపోయాడట కరణ్ జోహార్.  మరి  తెలుగులో వచ్చిన  ఫలితం తో సంబందం లేకుండా  కరణ్ చిత్రాన్ని రీమేక్ చేస్తాడో లేదో చూడాలి. 






మరింత సమాచారం తెలుసుకోండి: