‘డియర్ కామ్రేడ్’ మూవీని విజయ్ ఎంత కష్టపడి ప్రమోట్ చేసినా ఈసినిమాకు వచ్చిన డివైడ్ టాక్ రీత్యా మొన్న సోమవారం నుండి ఈమూవీ కలక్షన్స్ భారీగా పతనం అయ్యాయి. నిన్నటి రోజున మన తెలుగు రాష్ట్రాలలోని అనేక సెంటర్లలో ఈమూవీ ప్రదర్శిస్తున్న ధియేటర్లలో 40 శాతం ఆక్యుపెన్సీ కూడ కనిపించకపోవడంతో ఈమూవీ బయ్యర్లకు తీవ్ర నష్టాలు ఖాయం అన్నమాటలు వినిపిస్తున్నాయి.

ఇప్పటికే ‘ఇస్మార్ట్ శంకర్’ కలక్షన్స్ హడావిడి కూడ ముగిసి పోవడంతో ఈవారం బాక్స్ ఆఫీసు వెలవెల పోతోంది. ఇలాంటి పరిస్థుతులలో ఈశుక్రు వారం విడుదల కాబోతున్న బెల్లంకొండ ‘రాక్షసుడు’ కార్తికేయ ‘గుణ 369’ మూవీలలో ఏఒక్క సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా ఆసినిమా వచ్చే వారం ‘మన్మడుడు 2’ విడుదల అయ్యేదాకా బాక్స్ ఆఫీసును దున్నుకోవడం ఖాయం అంటూ ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. 

తమిళ మూవీ రీమేక్ గా వస్తున్న బెల్లంకొండ శ్రీను ‘రాక్షసుడు’ హిట్ అవుతుందనీ అతడు చాల నమ్మకంగా ఉన్నాడు. ఒక సైకో కిల్లర్ చుట్టూ తిరిగే ఈకథలో అనేక ట్విస్ట్ లు ఉంటాయి. ఈమధ్య కాలంలో యాక్షన్ థ్రిల్లర్ సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న నేపధ్యంలో ఈమూవీ విజయవంతం అవుతుంది అన్న అంచనాలతో ఈమూవీకి మంచి బిజినెస్ జరిగింది.

‘ఆర్ ఎక్స్ 100’ మూవీతో ఒకేసారి క్రేజీ స్టార్ గా మారిపోయిన కార్తికేయ నటించిన ‘హిప్పీ’ ఫెయిల్ అయినా ఇప్పటికీ యూత్ లో అతడి పై క్రేజ్ ఉంది. దీనితో ‘గుణ 369’ కు ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా ఈసినిమాకు యూత్ విపరీతంగా కనెక్ట్ అయ్యే ఆస్కారం ఉంది. దీనికితోడు ఈరెండు సినిమాలను చాల జాగ్రత్తగా తీసారు అన్న పాజిటివ్ ప్రీ రిలీజ్ టాక్ కూడ కొనసాగుతోంది. ప్రస్తుతం ‘డియర్ కామ్రేడ్’  మ్యానియా పూర్తిగా పడిపోయింది కాబట్టి విజయ్ దురదృష్టం బెల్లంకొండ కార్తికేయ లలో ఎవరికీ అదృష్టంగా మారుతుంది అన్నవిషయమై వేచి చూడాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: