అక్టోబర్ 2న ‘సైరా’ ను విడుదల చేయడానికి మెగా కాంపౌండ్ సర్వవిధాల ప్రయత్నాలు చేస్తోంది. ఈసినిమాకు ఆఖరి నిముషం టెన్సన్స్ ఉండకూడదనీ అన్ని పనులు సెప్టెంబర్ రెండవ వారానికే పూర్తి చేయాలని చిరంజీవి చరణ్ లు చాలముందు చూపుతో వ్యవహరిస్తున్నారు. 

ఈసినిమాకు సంబంధించిన ట్రైలర్ గురించి అందరు ఆశక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థుతులలో ఒక లేటెస్ట్ న్యూస్ ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. తెలుస్తున్న సమాచారం మేరకు వచ్చేనెల 15 మరియు 16 తారీఖులలో ఖతార్ లోని దోహా వేదికగా జరగబోతున్న సౌత్ ఇండియా ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ ‘సైమా’ వేదికపై ఈ చిత్ర ట్రైలర్ ని విడుదల చేయనున్నారని టాక్.

‘సైరా’ ను తెలుగుతో పాటు హిందీ మరియు దక్షిణాది భాషలలో విడుదల చేయబోతున్న నేపధ్యంలో అనేక భాషలకు సంబంధించిన సినిమా సెలెబ్రెటీలు పాల్గొనే ‘సైమా’ వేదిక పై ఈట్రైలర్ ను విడుదల చేస్తే తమ మూవీకి మంచి మైలేజ్ వస్తుందని మెగా కాంపౌండ్ స్కెచ్ అని అంటున్నారు. అయితే ఎక్కడో ఖతార్ దేశంలో ఈట్రైలర్ ను విడుదల చేయడం వల్ల వెంటనే ఈమూవీకి పెద్దగా వచ్చే ప్రయోజనం ఉండదు అంటూ కొందరు అభిప్రాయ పడుతున్నారు. 

ఈ ట్రైలర్ ను యూట్యూబ్ లో వెంటనే అప్ లోడ్ చేసి సోషల్ మీడియాలో సందడి చేసినా ట్రైలర్ లాంచ్ ఫంక్షన్ ను హైదరాబాద్ లో మెగా అభిమానుల మధ్య చేసి ఉంటే ఈమూవీ ట్రైలర్ కు మరింత క్రేజ్ ఏర్పడేదని ఈవిషయంలో మెగా కాంపౌండ్ ‘రాంగ్ స్టెప్’ వేసింది అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈమూవీకి జాతీయ స్థాయిలో మార్కెట్ కావాలి కాబట్టి సైమాను వేదికగా ట్రైలర్ లాంచ్ కు ఎంచుకుని ఉంటారు అని మరికొందరి అభిప్రాయం. ఇది ఇలా ఉండగా ఈసినిమాను ప్రమోట్ చేస్తూ అనేక ఛానల్స్ ప్రసారం చేసే ఇంటర్వ్యూలలో ఆ కార్యక్రమాలను స్వయంగా రామ్ చరణ్ నిర్వహిస్తాడు అని వార్తలు వినిపిస్తున్నాయి. దీనితో ‘సైరా’ కోసం చరణ్ యాంకర్ అవతారం ఎత్తుతాడు అనుకోవాలి..   


మరింత సమాచారం తెలుసుకోండి: