సైరా నరసింహారెడ్డి చిరంజీవి 151వ చిత్రంగా తెర‌కెక్కుతుంది. ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూ. 200 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో ఈ చిత్రం తెరకెక్క‌నుంది. స్వాతంత్య్ర‌ సమర యోధుడు, రేనాటి సూర్యుడుగా కొలవబడే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా ఈ సినిమా నిర్మించబడుతోంది. రాం చరణ్ ఈ సినిమాకు నిర్మాతగా కొణిదెల ప్రొడక్షన్స్ సంస్థ ఆధ్వర్యంలో ప్రారంభమైంది.


ఈ చిత్రాన్ని చిరు కెరీర్లో ఒక మైలురాయిలా నిలబెట్టాలని, ఆయన సత్తా ఏంటో దేశం మొత్తానికి చాటాలని ఎంతో పట్టుదలతో ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించాడు రామ్ చరణ్. బాహుబలి లాంటి సినిమా టాలీవుడ్ భారీ బడ్జెట్ సినిమాలకు ఒక దారి చూపించినట్లు హిట్టవ్వడంతో సైరా కూడా ఊపందుకుంది. ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ 2న ఈ సినిమాను విడుద‌ల చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. ప్ర‌పంచ వ్యాప్తంగా తెలుగుతో పాటు తమిళ, మలయాళ, హిందీ భాషల్లోనూ విడుద‌ల కానున్న ఈ సినిమా అన్ని చోట్లా ప్రమోషన్ బాగా చేసుకోవాలి.  


అయితే ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాటి ప్ర‌చారం, ప్రమోషన్‌ కార్యక్రమాలు స్టాట్ చేయ‌లేదు. ఫస్ట్‌లుక్‌ పోస్టర్స్‌తో పాటు ఒక్క టీజర్‌ను మాత్రమే రిలీజ్ చేసిన చిత్రయూనిట్ పూర్తి స్థాయి ప్రమోషన్స్‌ ప్రారంభించలేదు. దీంతో అభిమానులు అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్నారు. అస‌లు అనుకున్న తేదీకి సినిమా విడుద‌ల అవుతుందా? అన్న సందేహం కూడా ఏర్ప‌డుతోంది. ఇలాంటి భారీ బ‌డ్జెట్ సినిమాలు వాయిదా ప‌డ‌డం కొత్తేం కాదు. ఇటీవ‌ల `సాహో` సినిమా కూడా ఇలాగే వాయిదా ప‌డింది. 


సాహోను ముందు ఆగ‌స్టు 15న రిలీజ్ చేయాల‌ని అనుకున్నారు. ఆ త‌ర్వాత ఇది ఆగ‌స్టు 30కు వాయిదా ప‌డింది. ఇక ఇప్పుడు సైరా కూడా అలాగే వాయిదా ప‌డుతుందా ? అన్న సందేహాలు స్టార్ట్ అయ్యాయి. అందుకే భారీ అంచ‌నాలు పెట్టుకున్న‌ వారంద‌రూ `సైరా` విష‌యంలో ఏం జ‌రుగుతుంద‌న్న టెన్ష‌న్‌తో ఉన్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: