లవ్ స్టోరీలు సహజంగానే ఆకట్టుకుంటాయి. మరి ఆ లవ్ స్టోరీలన్నీ ఒకే కాలంలో జరుగుతుండటం కామన్.. కానీ ఓ పాతికేళ్ల క్రితం అమ్మాయి.. ఇప్పటి అబ్బాయితో ఫోన్ లో కాంటాక్ట్ అయితే.. ఆ ఇద్దరి మధ్య బంధం ఎలా ఉంటుంది.. కథ ఎలాంటి మలుపులు తిరుగుతుంది..


ఈ ఇంట్రస్టింగ్ టాపిక్ ఆధారంగా టాలీవుడ్ లో ఓ సినిమా రూపుదిద్దుకోబోతోంది. 1993 లోని అమ్మాయి 2019 లోని అబ్బాయితో ఫోన్ లో కనెక్ట్ అయితే ? అసలేం జరిగింది ? అనే కోణంలో ఈ సినిమా తయారవుతుందట. శ్రీవెంకటేశ్వర ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమా వస్తోంది.


నిర్మాత పీఆర్కే ప్రసాదరావు కాగా.. హరిప్రసాద్ జక్కా ఈ సినిమాకు దర్శకుడు. ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ ఆగస్ట్ 5 నుండి ప్రారంభం అవుతందట. ఇటీవలి కాలంలో తెలుగులో కొత్త కొత్త కాన్సెప్టులతో సినిమాలు తీసే దర్శకుల సంఖ్య పెరుగుతోంది. అలాంటి దర్శకులు చక్కటి విజయాలు కూడా సొంతం చేసుకుంటున్నారు.


ఈ హరిప్రసాద్ జక్కా కూడా అలాంటి ఓ వినూత్నమైన కథనే రాసుకున్నట్టున్నారు. స్టోరీలైన్ ని బట్టి చూస్తే.. పాతికేళ్ల క్రితం అమ్మాయి.. పాతికేళ్ల తర్వాత అబ్బాయిని ఫోన్ లో కనెక్ట్ అయితే.. అనిచెబుతున్నారు.. అంటే హీరోయిన్ చాలా పెద్ద వయస్సుదై .. హీరో కుర్ర వయస్సువాడై ఉండాలి.


లేకపోతే.. ఆదిత్య 369 సినిమా తరహాలో టైమ్ మెషీన్ వంటి కాన్సెప్టు అయినా అయి ఉండాలి. మొత్తానికి సినిమా లైన్ మాత్రం వినూత్నంగా ఉంది. గతంలోనూ తెలుగులో టైమ్ మెషీన్, టైమ్ కాన్సెప్టుతో చాలా సినిమాలు వచ్చినా వాటిలో ఆకట్టుకున్నవి కొన్నే.


ఇలాంటి సినిమాల్లో లాజిక్ బలంగా లేకపోతే కథ రక్తి కట్టదు సరి కదా.. తేలిపోతుంది. మరి దర్శకుడు ఇంత టిపికల్ కాన్సెప్టును ఎలా డీల్ చేస్తాడో చూడాలి. పోస్టర్ లో ఓ పాతకాలపు ట్రింగ్ ట్రింగ్ లాండ్ లైన్ ఫోన్ సెట్ ను చూపించారు. అలాగే న్యూస్ పేపర్ లో ఓవైపు లాతూర్ భూకంపం, మరోవైపు చంద్రయాన్ 2 చూపించారు. మరి సినిమా ఎలా చూపిస్తారో.


మరింత సమాచారం తెలుసుకోండి: