త‌మ‌న్నా సింహాద్రి బిగ్ బాస్ - 3 తెలుగు వెర్ష‌న్లో వైల్డ్ కార్డ్ ద్వారా సెకండ్ వీక్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఫ‌స్ట్ వీక్ ముగిసిన వెంట‌నే హేమ హౌస్ నుంచి ఎలిమ‌నేట్ అవ్వ‌గా ఆమె ప్లేస్‌లో త‌మ‌న్నా సింహాద్రి ఎంట్రీ ఇచ్చింది. ఇంత‌కు త‌మ‌న్నా సింహాద్రి ఎవ‌ర‌నేది కొంత మందికి క్లారిటీ ఉన్నా చాలా మందికి మాత్రం ఆమె గురించి తెలియ‌దు. ఆమె ఓ ట్రాన్స్‌జెండ‌ర్‌. ఇటీవ‌ల ఎన్నిక‌ల్లో జ‌న‌సేన నుంచి మంగ‌ళ‌గిరిలో పోటీ చేస్తాన‌ని నానా ర‌చ్చ చేసింది. 


ప‌వ‌న్ నాకు ఎందుకు సీటు ఇవ్వ‌డో చూస్తాన‌ని కూడా స‌వాల్ చేసింది. చివ‌ర‌కు ప‌వ‌న్ ఈ సీటును పొత్తులో భాగంగా క‌మ్యూనిస్టుల‌కు ఇచ్చేశాడు. దీంతో అగ్గిమీద గుగ్గిలం అయిన త‌మ‌న్నా ఎలాగైనా మంగళగిరిలో లోకేష్ మీద పోటీచేయాల్సిందే అని పంతం వేసుకుని చివ‌ర‌కు ఇండిపెండెంట్‌గా పోటీకి దిగింది. ఆమెది కృష్ణా జిల్లా అవనిగడ్డ ప్రాంతం... అందుకే మంగళగిరిలో పోటీ చేసింది. ఆమె లోకేష్ మీద పోటీ చేస్తుండ‌డంతో స్థానిక మీడియా వాళ్లే కాకుండా జాతీయ మీడియా సైతం విప‌రీత‌మైన ప‌బ్లిసిటీ చేసేశాయి.


తెలుగులో తొలిసారి ఎన్నిక‌ల్లో పోటీ చేస్తోన్న ట్రాన్స్‌జెండ‌ర్ అంటూ ప్ర‌చారం ఊద‌ర‌గొట్టేశాయి. చివ‌ర‌కు ఆమెకు వ‌చ్చిన ఓట్లు 45 మాత్ర‌మే. ఎవ‌రెంత ప్ర‌చారం చేసి హైప్ తీసుకువ‌చ్చినా ఆమెకు వ‌చ్చిన ఓట్లు చూస్తే ఆమె ప్ర‌భావం ఎంత మాత్రం లేద‌ని తేలిపోయింది. ఇక ఇప్పుడు ఆమె బిగ్ బాస్ నిర్వాహకుల కంట్లో పడింది. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఆమెను హౌస్‌లోకి పంపేశారు.


ఇంతకీ త‌మ‌న్నా ఎవరో కాదు. ఆమెకు రాజకీయ కుటుంబ నేపథ్యం కూడా ఉంది. ఆమె అసలు పేరు సింహాద్రి మ‌స్తాన్‌. వీళ్లు హిందువులే. గతంలో సింహాద్రి సత్యనారాయణ అని అవ‌నిగ‌డ్డ నుంచి గెలిచిన టీడీపీ హ‌యాంలో మంత్రిగా ప‌నిచేశారు. ఆయ‌న‌కు దేవుడు మంత్రిగా కూడా పేరుంది. అంటే ఎంతో నిజాయ‌తీ ప‌రుడ‌న్న మాట‌. త‌మ‌న్నాకు ఆయ‌న పెద‌నాన్న అవుతారు. అంటే స‌త్య‌నారాయ‌ణ‌కు త‌మ‌న్నా కూతురు వ‌రుస అవుతుంది. ఇక త‌మ‌న్నా తండ్రి రైతు. మ‌గ‌వాడిగా ఉండ‌డం ఇష్టంలేక ఇళ్లు వ‌దిలి హైద‌రాబాద్‌కు వ‌చ్చేసింది. అక్క‌డ నుంచి ముంబైకు చెక్కేసి ట్రాన్స్‌జెండ‌ర్‌గా మారిపోయింది.



మరింత సమాచారం తెలుసుకోండి: