సినిమా రంగంలో ఎప్పుడు ఏదో ఓక వివాదం నడుస్తూనే ఉంటుంది.  వివాదాలు లేకుండా సినిమా ఉండదు.  అందుకే సినిమాల్లో నటించే వ్యక్తులు అలాంటి వివాదాలకు దూరంగా ఉండాలని చూస్తున్నారు.  ఎంత దూరంగా ఉండాలని చూసినా కుదరదు.  కుదరకపోవడం అటుంచితే.. ఈమధ్య సినిమా ఇండస్ట్రీని డ్రగ్స్ వివాదం ఇబ్బందులకు గురిచేస్తున్న సంగతి తెలిసిందే.  


టాలీవుడ్ తో పాటు ఈ వ్యాధి బాలీవుడ్ లోను ఉన్నది.  ఒక విధంగా చెప్పాలంటే, బాలీవుడ్ లొనే డ్రగ్స్ తీసుకునేవారి సంఖ్య ఎక్కువ.  ఇటీవల కాలంలో వచ్చిన ఉడ్తా పంజాబి సినిమా డ్రగ్స్ గురించి తీసిందే.  దీనిపై ఎన్ని విమర్శలు వచాయో చెప్పక్కర్లేదు. అయితే, ఇటీవలే, కరణ్ జోహార్ కొంతమంది బాలీవుడ్ ప్రముఖులకు పార్టీ ఇచ్చాడు.  ఈ పార్టీకి చలామంది హాజరయ్యారు. ఈ పార్టీలో బాలీవుడ్ నటులు డ్రగ్స్ తీసుకున్నారని ఓ రాజకీయ నాయకుడు విమర్శలు చేశారు.  ఈ విమర్శలపై కాంగ్రేస్ పార్టీ నేత, సినినటుడు కౌంటర్ ఇచ్చాడు. 


పార్టీలో ఎవరూ ఎలాంటి డ్రగ్స్ తీసుకొలేదని, ఆ పార్టీలో తన భార్య కుడా ఉందని చెప్పాడు.  బాలీవుడ్ పరిశ్రమలో ఎవరైనా పార్టీలు చేసుకుంటె దానికి డ్రగ్స్ అనే ట్యాగ్ తగిలించడం బాగాలేదని, ప్రతి ఒక్కరు అలా ఉండరని ఆయన అవేదనను వ్యక్తం చేశాడు.  బాలీవుడ్‌ దర్శక నిర్మాత కరణ్‌ జోహార్‌..కొందరు బాలీవుడ్‌ ప్రముఖులకు ఇటీవల పార్టీ ఇచ్చారు. దీపిక పదుకొణె, రణ్‌బీర్‌ కపూర్‌, విక్కీ కౌశల్‌, అర్జున్‌ కపూర్‌, మలైకా అరోరా, షాహిద్‌ కపూర్‌, దర్శకుడు అయాన్‌ ముఖర్జీ తదితరులు ఈ పార్టీకి హాజరయ్యారు. 


ఒకరినొకరు అర్దం చేసుకుంటూ, భవిష్యత్ సినిమాల గురించి చర్చించుకుంటూ, పార్టీలు ఏర్పాటు చేసుకుంటారు.  ఇది ఎప్పటి నుంచో వస్తున్న ఆనవాయితినే.  కొత్తగా ఇప్పుడు మొదలైంది కాదు.  బాలీవుడ్ లో గెట్ టుగెదర్ పేరుతో నిత్యం పార్టీలు జరుగుతూనే ఉంటాయి.  ఇదేమంత పెద్ద విషయం కాదు.  కానీ, దీనిని కొందరు పెద్ద విషయం చేసి భూతద్దంలో చూపిస్తుంటారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: