ప్రస్తుతం టాలీవుడ్ లో నాగ్ చాలా బిజీ అయ్యారు.  వరసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు.  అయన నటించిన మన్మథుడు 2 సినిమా ఆగష్టు 9 వ తేదీన రిలీజ్ కాబోతున్నది.  ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇందులో గతంలో వచ్చిన మన్మధుడు సినిమాకు ఇది సీక్వెల్.  దీన్ని రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించారు.  ట్రైలర్ ఆకట్టుకునే విధంగా ఉండటంతో సినిమాపై అంచనాలు పెరిగాయి.  


ఈ సినిమాతో పాటు నాగార్జున రియాలిటీ షో బిగ్ బాస్ 3 కి హోస్ట్ గా చేస్తున్నారు.  60 సంవత్సరాల వయసులో కూడా నాగార్జున చాలా యాక్టివ్ గా ఉంటూ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు.  ఒకవైపు సినిమాలు, మరోవైపు రియాలిటీ షో హోస్టింగ్, నిర్మాతగా సినిమాలు నిర్మించడం, వ్యాపారం చూసుకోవడం అంటే మామూలు విషయం కాదు.  చాలా జాగ్రత్తగా ఉండాలి.  


నాగ్ ఈ విషయంలో చాలా క్లారిటీగా ఉంటాడు.  ఎప్పటికప్పుడు రిఫ్రెష్ అవుతూ.. నిత్యం చురుగ్గా ఉండేందుకు నాగ్ ప్రయత్నిస్తాడట. తనను తాను ఎప్పుడు ఫ్రెష్ గా ఉంచుకోవడం వలనే ఇదంతా సాధ్యం అవుతుందని అంటున్నాడు నాగ్.  నాగార్జున తో పాటు తన కొడుకులు ఇద్దరు కూడా సినిమా రంగంలోకి అడుగు పెట్టారు.  ఇద్దరితోనే తనకు పోటీ ఉంటుందని, వాళ్లకు పోటీగా నటించాలని అప్పుడే ఇండస్ట్రీలో నిలబడగలుగుతామని నాగ్ చెప్తున్నాడు.  


నటించడం అంటే చాలా చాలా ఇష్టం అని, ఖాళీగా కూర్చుంటే తనకు తానే బోర్ కొడతానని నాగ్ అంటున్నాడు.  నిత్యం బిజీగా ఉండటానికి ట్రై చేస్తానని, లేదంటే ఎక్కడికైనా వెళ్లి రిఫ్రెష్ అవుతానని చెప్తున్నాడు నాగ్.  మన్మధుడు 2 సినిమా ప్రతి ఒక్కరికి తప్పకుండా నచ్చుతుందని అంటున్న నాగ్, నెక్స్ట్ ప్రాజెక్ట్ ను త్వరలోనే ప్రకటిస్తారట.  నాగార్జున  సోగ్గాడే చిన్నినాయన సినిమా తరువాత అంతపెద్ద హిట్ దొరకలేదు.  మన్మధుడు 2 మీదనే నాగ్ ఆశలు ఉన్నాయి.  మరి సినిమా ఎలా ఉంటుందో చూద్దాం. 


మరింత సమాచారం తెలుసుకోండి: