‘గీత గోవిందం’ తరువాత విజయ్ దేవరకొండ నుండి వచ్చిన ‘నోటా’ ‘టాక్సీవాలా’ ‘డియర్ కామ్రేడ్’ మూవీలలో ఒక్క ‘టాక్సీవాలా’ తప్ప మిగతా రెండుసినిమాలు బయ్యర్లకు విపరీతమైన నష్టాలు రావడంతో విజయ్ కు స్వీట్ వార్నింగ్ తగిలింది అంటూ ఇండస్ట్రీ వర్గాలలో కామెంట్స్ వస్తున్నాయి. దీనితో ఎలర్ట్ అయిన విజయ్ తన పిఆర్ టీమ్ లో పూర్తి మార్పులు చేస్తున్నట్లు సమాచారం. తనకు కథలు చెప్పడానికి వచ్చే అనేకమంది యంగ్ డైరెక్టర్స్ చెప్పే స్టోరీ లైన్స్ ను వినడానికి విజయ్ ఒక ప్రత్యేకమైన టీమ్ ను ఏర్పాటు చేసినట్లు టాక్. ఈ టీమ్ లో కొంతమంది యంగ్ రైటర్స్ తో పాటు విజయ్ దేవరకొండ తండ్రి తమ్ముడు ఆనంద్ దేవరకొండ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. 

ఇప్పటికే ‘గీతగోవిందం’ తరువాత వచ్చిన మూడు సినిమాలు విజయ్ కెరియర్ గ్రాఫ్ ను ఏమాత్రం పెంచలేకపోయిన పరిస్థితులలో మరో తప్పటడుగు తనవైపు నుంచి చేయకూడదు అన్న ఉద్దేశ్యంతో భవిష్యత్ లో తాను ఒప్పుకోబోయే సినిమాల కథల విషయంలో చాల ఆచితూచి నిర్ణయాలు తీసుకోబోతున్నట్లు టాక్. దీనికితోడు ప్రస్తుతం ఇండస్ట్రీలో కొన్నివర్గాలు విజయ్ పై నెగిటివ్ ప్రచారం చేయడమే ఒక ప్రధాన ధ్యేయంగా ప్రవర్తిస్తున్న పరిస్థితులలో మరొక తప్పటడుగు వేస్తే ఇక కోలుకోలేని పరిస్థితిలోకి వెళ్ళి పోతాము అన్నవిషయం స్పష్టంగా విజయ్ కు అవగాహన వచ్చింది అని అంటున్నారు.

ఇలాంటి పరిస్థితుల నేపధ్యంలో విజయ్ ప్రస్తుతం క్రాంతి మాధవ్ దర్శకత్వం వహిస్తున్న మూవీ విషయాల పై చాల శ్రద్ద పెడుతున్నట్లు టాక్. ఇప్పటికే ఈసినిమా షూటింగ్ చాలభాగం పూర్తి అయిపోయింది. వాస్తవానికి క్రాంతి మాధవ్ పరిస్థితి ఇండస్ట్రీలో ఏమాత్రం బాగాలేదు. ఈ డైరెక్టర్  ఆమధ్య సునీల్ తో చేసిన ‘ఉంగరాల రాంబాబు’ అంతకుముందు తీసినసినిమాలు కూడ ఫెయిల్ అయ్యాయి. వాస్తవానికి ‘గీతాగోవిందం’ విడుదల అవ్వకముండు ఒప్పుకున్న సినిమా క్రాంతి మాధవ్ మూవీ. 

ప్రస్తుతం మారిన విజయ్ ఇమేజ్ కి ప్రస్తుతం నడుస్తున్న నెగిటివ్ ప్రచారానికి తట్టుకుని క్రాంతి మాధవ్ మూవీ నిలబడగలుగుతుందా అన్న సందేహాలు స్వయంగా విజయ్ దేవరకొండకు ఏర్పడుతున్నట్లు టాక్. దీనితో ఈ సినిమాను ఎలా పూర్తి చేస్తే ఈ ఫెయిల్యూర్ గండాల నుండి బయటపడగలం అన్న విషయం కూడ విజయ్ ని కలవర పెడుతున్నట్లు తెలుస్తోంది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: