చిరంజీవి కొరటాల శివ కాంబినేషన్ లో ప్రారంభించబోయే మూవీ ఎట్టకేలకు ఈనెల 22న చిరంజీవి పుట్టినరోజునాడు ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తి అయిన ఈసినిమాకు సంబంధించి ఒక లేటెస్ట్ విషయం ఇప్పుడు లీక్ అయింది. 

చిరంజీవి ద్విపాత్రాభినయం చేస్తున్న ఈమూవీలో చిరజీవి నటించే రెండు పాత్రలు రెండూ డిఫరెంట్ గా ఉండేలా కొరటాల చాల జాగ్రత్తలు తీసుకున్నాడు. ఈమూవీలో గోవింద్ అనే యువకుడు పాత్రలో ఆచార్య అనే ఒక నడి వయస్కుడు పాత్రలో చిరంజీవి నటిస్తున్నాడు. అయితే ఈ ఆచార్య పాత్ర నక్సలిజం భావజాలం ఉండే పాత్రలో ఉంటుందట. 

స్వతహాగా మార్కిస్టు భావాలు ఎక్కువగా ఉన్న కొరటాల తన ఆలోచనలు అన్నీ చిరంజీవి నటించబోయే ఆచార్య పాత్రలో ప్రతిబింబిస్తాడని తెలుస్తోంది. దీనికితోడు సోషలిజం భావాలు కూడ ఎక్కువగా ఉన్న కొరటాల తన అభిప్రాయాలకు తగ్గట్టుగా ఈ ఆచార్య పాత్రను డిజైన్ చేసినట్లు టాక్. గోవిందుడు పాత్రకు వస్తే మాస్ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని డిజైన్ చేయపడ్డ ఈపాత్ర చాల మాసీగా ఉంటుందని అంటున్నారు. నక్సలిజం భావాలు ఉన్న ఆచార్య పాత్రకు భార్యగా నయనతారను ఇంచుమించు ఖరార్ చేసినా కొరటాల దృష్టి అంతా ఇప్పటికీ ఐశ్వర్య రాయ్ పై ఉండటంతో ఏదోవిధంగా ఆమెను ఒప్పించాలని ఇప్పటికీ కొరటాల తనవంతు ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. 

ఇక గోవింద్ పాత్రకు సంబంధించి హీరోయిన్ గా ముంబాయికి చెందిన ఒక కొత్త హీరోయిన్ ను తీసుకురావాలని కొరటాల ప్లాన్ అని అంటున్నారు. ఈసినిమాకు సంబంధించిన పాటల విషయంలో కూడ కొరటాల చాల శ్రద్ధ తీసుకుంటూ ప్రతి పాటలోని సాహిత్యం తన ఉద్దేశాలకు అనుగుణంగా మాస్ ప్రేక్షకులకు కూడ అర్ధం అయ్యే రీతిలో ప్రత్యేకంగా వ్రాయిస్తున్నట్లు సమాచారం. ఈసినిమాను చాల వేగంగా పూర్తిచేసి వచ్చే ఏడాది ఉగాది రోజున విడుదల చేయాలని కొరటాల స్కెచ్.  


మరింత సమాచారం తెలుసుకోండి: