తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.  ఇందులో  జయలలిత పాత్రలో కంగనా రనౌత్ చేస్తున్నది.  తలైవి అనే టైటిల్ తో సినిమా తెరకెక్కుతోంది.ఏఎల్ విజయ్ దర్శకత్వంలో సినిమా  తెరకెక్కుతోంది.  ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తయింది.  తలైవి కోసం హాలీవుడ్ నుంచి మేకప్ ఆర్టిస్టులు  పనిచేస్తున్నారు.  ఈ మూవీ కోసం కంగనా  తమిళం నేర్చుకుంటోంది.  


తమిళనాడులో అమ్మకు ఎంత మంచి  పేరు ఉన్నదో చెప్పక్కర్లేదు.  పేదల కోసం అమ్మ ఎన్నో పధకాలు ప్రవేశపెట్టింది.  ఈ పధకాలు  ప్రజలకు ఎంతగా  చేరువయ్యాయో చెప్పక్కర్లేదు.  వరసగా రెండోసారి ముఖ్యమంత్రిగా ఎంపికయ్యాక, ఆమె మరిన్ని పధకాలు ప్రవేశపెట్టింది.  ఈ సమయంలో ఆమె సడెన్ గా అనారోగ్యం పాలవ్వడం హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటూ మరణించడం జరిగిపోయింది.  అమ్మ మరణంతో తమిళనాడు రాష్ట్రం దిక్కులేనిది అయ్యింది.  


అనుభవం ఉన్న నేత రాష్ట్రానికి దూరమైతే రాష్ట్రం ఎలా మారిపోతుందో తమిళనాడే ఒక ఉదాహరణ.  జయలలిత చదువుకునే రోజుల్లోనే సినిమాల్లో  చేయడానికి రెడీ అయ్యింది.  ఒకవైపు చుదువు, మరో వైపు సినిమా రెండింటిని మ్యానేజ్ చేసింది.  సినిమా ప్రాధాన్యత సినిమాకు ఇస్తూ... రాజకీయాలకు ఇవ్వాల్సిన ప్రాధాన్యత రాజకీయాలకు ఇచ్చింది.  


సినిమా రంగంలో మంచి పేరు గడించిన ఆమె.. రాజకీయాల్లోను చక్రం తిప్పింది.  ఎంజీఆర్ వారసురాలిగా రాజకీయ రంగంలోకి అడుగుపెట్టిన  జయలలిత  రాజకీయాల్లో తిరుగులేని నాయకురాలిగా విజయం సాధించింది.  రాజకీయాల్లో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్న జయలలిత ఎలా ముఖ్యమంత్రి అయ్యింది.. ఆమె జీవితం ఎలా గడిచింది అనే విషయాలను సినిమాలో ప్రస్తావించబోతున్నారు.  అయితే తమిళనాడు రాజకీయాలు చాలా సున్నితమైనవి..  వాటిని సినిమాగా తీసేసమయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.  ఏదైనా తేడా వస్తే దాని ఫలితం చాలా తీవ్రంగా ఉంటుంది.  అందుకే రచయిత విజయేంద్ర ప్రసాద్ జాగ్రత్తగా స్క్రిప్ట్ ను తయారు చేశారట. 


మరింత సమాచారం తెలుసుకోండి: