బిగ్ బాస్ సీజన్ 1 విజేతగా శివ బాలాజీ ఎంపిక కావడానికి పవన్ వీరభిమానులు శివ బాలాజీకి వేసిన ఓట్లు ప్రధానకారణం అంటూ అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇప్పడు అదే వ్యూహాన్ని ‘బిగ్ బాస్ సీజన్3’ కంటెస్టంట్  అషు రెడ్డి అనుసరిస్తోంది. జూనియర్ సమంత అంటూ గుర్తింపు తెచ్చుకున్న అషు రెడ్డి ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో ఉన్న నేపధ్యం తెలిసిందే.  

వాస్తవానికి  ఒకప్పుడు ఈమెకు ఉన్న క్రేజ్ ఇప్పడులేదు. దీనికితోడు  ఈమె బాగా బొద్దుగా తాయారుకావడంతో ఈమె క్రేజ్ బాగా తగ్గి పోయింది. ఇలాంటి పరిస్థుతులలో ‘బిగ్ బాస్ 3’ సీజన్ లో పోటీ పడుతున్న ఈమెకు పవన్ అభిమానుల సపోర్ట్ లభించేలా ఆమె సన్నిహితులు ఒక వ్యూహం రచించారు.  

ఇందులో భాగంగా ఆమె ఒకప్పుడు చేసిన ట్విట్ ను ఇప్పుడు మళ్ళీ గుర్తుకు చేస్తూ ఆట్విట్ ను వైరల్ గా చేయడానికి తీవ్రప్రయత్నం చేస్తున్నారు. అషు రెడ్డి తన చెస్ట్ పై పవన్ కళ్యాణ్ పేరును టాటూ వేయించుకుంది. 2018లో ట్విట్టర్ లో తాను పవన్ పేరును టాటూ వేయించుకున్నాను అంటూ ఆఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.   ఆ సమయంలో అషు రెడ్డి గురించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఆతర్వాత పవన్ కళ్యాణ్ తో కలిసి తీయిమ్చుకున్న ఫొటోను కూడా ఆమె సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది.

ఇప్పుడు పవన్ పై ఆమెకు ఉన్న అభిమానం ‘బిగ్ బాస్’ లో ఓట్ల రూపంలో మార్చుకోవడానికి ఆమె టీమ్ గట్టి ప్రయత్నాలు చేస్తోంది. ఆమె పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని కాబట్టి ఆమెను సపోర్ట్ చేయడం పవన్ అభిమానుల కనీస భాద్యత  అంటూ  ఇన్ డైరెక్ట్ గా పవన్ ఫ్యాన్స్ ను  టార్గెట్ చేస్తున్నారు. ఇప్పటికే ‘బిగ్ బాస్’ లోకి వెళ్లిన శ్రీముఖి ఎక్కువ శాతం ఓట్లు రాబట్టుకుని విజేత మారాలని తనవంతు ప్రయత్నాలు చేస్తున్న పరిస్థుతులలో ఇలా అషు రెడ్డి రంగంలోకి దిగి శ్రీముఖి వ్యూహాలకు దెబ్బ కొడుతోంది అనుకోవాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: