ప్రస్తుతం అల్లు అర్జున్ నటిస్తున్న త్రివిక్రమ్ మూవీ షూటింగ్ పూర్తి కాకుండానే క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో నటించబోయే కొత్త మూవీ స్క్రిప్ట్ కు లైన్ క్లియర్ చేయడమే కాకుండా ఈమూవీ  షూటింగ్ ను ఈనెల నుంచి మొదలు పెట్టబోతున్నట్లు ప్రకటన ఇప్పించడం ఇప్పుడు చాలమందికి సమాధానం లేని ప్రశ్నగా  మారింది. తెలుస్తున్న సమాచారం మేరకు బన్నీ త్రివిక్రమ్ ల మూవీ వర్క్ ఇంకా 40 శాతం వరకు పెండింగ్ లో ఉందని టాక్. 

సంక్రాంతి రిలీజ్ టార్గెట్ గా పెట్టుకున్న ఈమూవీ షూటింగ్ పూర్తి కాకుండా బన్నీ సుకుమార్ సినిమాను మొదలుపెట్టినా డేట్స్ ఎలా ఇస్తాడు అన్నసందేహాలు వస్తున్నాయి. దీనికితోడు సుకుమార్ కథలో ఎర్ర చందనం అక్రమ రవాణాను ఎదిరించే హీరోపాత్ర బన్నీది కావడంతో ఆపాత్ర కోసం బన్నీ స్పెషల్ లుక్ లో కనిపించాలి అని ఇప్పటికే సుకుమార్ అల్లుఅర్జున్ కు చెప్పినట్లు టాక్.

ప్రస్తుతం త్రివిక్రమ్ సినిమాలో అల్లుఅర్జున్ నటిస్తున్న పాత్రకు ప్రత్యేకమైన మేకోవర్  ఏదీ లేదు. ఇలాంటి పరిస్థితులలో త్రివిక్రమ్ సినిమాను పూర్తి చేయకుండా బన్నీ సుకుమార్ సినిమాకు ఎలా డేట్స్ ఇచ్చాడు అంటూ సందేహాలు వస్తున్నాయి. ఇది చాలదు అన్నట్లుగా అల్లుఅర్జున్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో నటించే మూవీ స్క్రిప్ట్ కు ఓకె చెప్పడంతో ఆమూవీకి కూడ ఈఏడాది నవంబర్ నుండి డేట్స్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.

దీనితో ఒకవైపు త్రివిక్రమ్ సినిమాను చేస్తూ సంక్రాంతికి విడుదలకాబోయే ఆమూవీ ప్రమోషన్ లో పాల్గొంటూ ఒకేసారి రెండు కొత్త సినిమాలను ఎలా మొదలుపెడతాడు అంటూ చాలామంది ఆశ్చర్య పడుతున్నారు. కేవలం ఇది అంతా సుకుమార్ ను నిరాశ పరచకుండా తాను సుకుమార్ కు ఇచ్చిన మాటను నిలుపుకునే ప్రయత్నంలో అల్లు అర్జున్ ఆడుతున్న గేమ్ అని మరికొందరి ఊహ. ఏది ఎలా ఉన్నా ‘రంగస్థలం’ లాంటి భారీ హిట్ ఇచ్చి కూడ సంవత్సరం పైగా ఖాళీగా ఉన్న సుకుమార్ ను బన్నీ తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ సుకుమార్ మూవీని పట్టాలు ఎక్కిస్తున్నాడు అని అనుకోవాలి..  
 



మరింత సమాచారం తెలుసుకోండి: