అ  సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన దర్శకుడు ప్రశాంత్ వర్మ. డిఫరెంట్ స్క్రీన్ ప్లే తో సినిమాను తెరకెక్కించడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య.  ఈ సినిమా కోసం ఆయన చాలా కష్టపడ్డాడు.  అ సినిమా కంటే ముందు ప్రశాంత్ వర్మ దాదాపు పదిపదిహేను సినిమాలకు రిపేరింగ్ దర్శకుడిగా పనిచేశారు.  అంటే మధ్యలో ఆగిపోయిన సినిమాలు.. దర్శకులు అందుబాటులో లేనప్పుడు ఆ సినిమాలు.. కొన్ని సీన్స్ కు ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించాడు.  


ఇలా  వివిధ రకాల సినిమాలకు దర్శకత్వం వహించడం ఆయనకు  బాగా కలిసి వచ్చింది.  ఏ మూవీని ఎలా తీయాలో నేర్చుకున్నాడు.  ఫలితం అ సినిమా విజయం.  చాలా  కొత్తగా ఉందని ప్రేక్షకులు ఫీలయ్యారు.  ఈ దర్శకుడు రెండో సినిమాగా రాజశేఖర్ కల్కి చేశాడు.  ఈ సినిమా కూడా ఆకట్టుకుంది.  సినిమాపై అంచనాలు పెంచింది.  


కల్కి స్క్రీన్ ప్లేను  కూడా కొత్తగా ప్రజెంట్  చేశాడు.  సినిమా బాగా వచ్చింది.  విజయం సాధించింది.  రెండో సినిమా కూడా మంచి విజయం సాధించడంతో నెక్స్ట్ సినిమాపై దృష్టి పెట్టాడు వర్మ.  అఖిల్ కోసం ఓ క్యూట్ లవ్ స్టోరీతో కథను రెడీ చేసుకున్నారని, ఇప్పటికే అఖిల్ కు కథను వినిపించారని తెలుస్తోంది.  కథ నచ్చడంతో స్క్రిప్ట్ రెడీ చేయమని చెప్పినట్టు సమాచారం.  ఒకవేళ స్క్రిప్ట్ రెడీ అయితే, ఈ సినిమా కూడా సెట్స్ మీదకు వెళ్తుంది.  


ప్రస్తుతం అఖిల్... నాలుగో సినిమా చేస్తున్నాడు.  బొమ్మరిల్లు  భాస్కర్ దర్శకుడు.  గీతా ఆర్ట్స్ సంస్థ సినిమాను నిర్మిస్తోంది.  ఇటీవలే సినిమా షూటింగ్ ప్రారంభమైంది.  బొమ్మరిల్లు, పరుగు వంటి సినిమాలకు దర్శకత్వం వహించిన భాస్కర్ చేస్తున్న సినిమా కావడంతో అంచనాలు ఉన్నాయి.  గీత ఆర్ట్స్ సినిమా కాబట్టి తప్పకుండా విజయం సాధించే అవకాశం ఉన్నది.  
అఖిల్ గతంలో చేసిన అఖిల్,  హలో, మిస్టర్ మజ్ను సినిమాలు చేశారు.  ఈ మూడు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. 

ఎలాగైనా నాలుగో సినిమాతో హిట్ కొట్టాలని కొట్టాలని ప్రయత్నిస్తున్నాడు.   భాస్కర్ సినిమాతో  హిట్ ట్రాక్ లోకి రావాలని చూస్తున్నాడు అఖిల్.  మరి అఖిల్ కోరుకున్నట్టుగా భాస్కర్ హిట్ ఇస్తాడా.. చూడాలి.  ప్రశాంత్ వర్మ సినిమాను ఎవరు నిర్మిస్తున్నారు అన్నది త్వరలోనే తేలిపోతుంది.  ఎలాగో  చైతన్య.. సమంతలు నిర్మాతలుగా మారాలని అనుకుంటున్నారు.  పనిలో పనిగా అఖిల్ సినిమాకు నిర్మాతలుగా మారి మంచి హిట్ ఇస్తే బాగుంటుంది కదా. 


మరింత సమాచారం తెలుసుకోండి: