ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి `బాహుబ‌లి` సిరీస్ త‌ర్వాత తెర‌కెక్కిస్తున్న భారీ బ‌డ్జెట్ మ‌ల్టీస్టార‌ర్ `ఆర్ఆర్ఆర్‌`. ఇందులో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా న‌టిస్తున్నారు. తెలుగు వీరులు అల్లూరి సీతారామరాజు, కొమురం భీం జీవిత కథల ఆధారంగా ఈ చిత్రం తెర‌కెక్క‌బోతుంది. డీవీవీ దాన‌య్య చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో అలియా భ‌ట్ రామ్ చ‌ర‌ణ్‌కు హీరోయిన్‌గా ఎంపిక అయింది. మ‌రియు ముందుగా ఎన్టీఆర్‌కు విదేశీయ హీరోయిన్  డైసీ ఎడ్గార్ జోన్స్ ఎంపిక చేశారు. అయితే ఆమె ప‌లు కార‌ణ‌లు చెప్పి ఈ సినిమాకు దూరం అయింది. 


ఆ త‌ర్వాత‌ రాజ‌మౌళి ఎన్టీఆర్ హీరోయిన్ కోసం వేట ప్రారంభించాడు. అయితే ఏ ముహూర్తాన ఈ సినిమా మొద‌లుపెట్టారో గానీ అన్నీ అడ్డంకులే త‌గులుతున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ సినిమా ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి ఎన్టీఆర్‌కు హీరోయిన్ సెట్ చేయ‌లేక‌పోయాడు. అయితే ఇటీవ‌ల ఆర్ఆర్ఆర్  టీం ప్రెస్ మీట్ పెట్టింది. ఆ ప్రెస్ మీట్‌కు రాజ‌మౌళితో పాటు ఇద్ద‌రు హీరోలు హాజ‌ర‌య్యారు. అయితే ఇక్క‌డే ఎన్టీఆర్ అభిమానులు హ‌ర్ట్‌ అయ్యారు. అయితే ఈ ప్రెస్ మీట్‌లో రామ్ చ‌ర‌ణ్ మాత్రం మంచి ఫిజిక్‌తో,  కోర మీసంతో సినిమాలో పాత్ర‌కు త‌గ్గ‌ట్టు మంచి లుక్‌తో పాల్గొన‌డంతో సోష‌ల్ మీడియాలో ఆ ఫోటోలు వైర‌ల్ అయ్యాయి. 


కానీ ఎన్టీఆర్ మాత్రం ఎలాంటి లుక్‌గానీ, ఫిజిక్‌గానీ లేకుండా సాధార‌ణ‌గా క‌నిపించ‌డంతో అభిమానులు నిరాశ చెందారు. అలాగే ఆ త‌ర్వాత రామ్ చ‌ర‌ణ్ ఎయిర్ పోర్ట్‌లో మ‌రోసారి క‌నిపించ‌డంతో ఇంత‌కు ముందు చూసిన లుక్ కంటే  మ‌రింత బెస్ట్ లుక్‌తో క‌నిపించి ఆక‌ట్టుకున్నాడు. దీంతో మెగా ఫ్యాన్స్ ఎంతో ఆనందించారు. మ‌రి షూటింగ్ ఎంత శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నా ఎన్టీఆర్ లుక్ గురించి ఏ మాత్రం స్ప‌ష్ట‌త లేక‌పోవ‌డంతో ఎన్టీఆర్ అభిమానులు తీవ్ర నిరాశ‌లో ఉన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: