ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా స్నేహితుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ద్వాపర యుగంలో శ్రీకృషుడు కుచేలుడు దగ్గర నుండి ఎందరో తమతమ స్థాయిలను పట్టించుకోకుండా స్నేహానికి విలువను ఇస్తూ చరిత్రకు ఎక్కిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ‘స్నేహమేరా జీవితం స్నేహమేరా శాస్వతం’ అంటూ ఎందరో వయసుతో సంబంధం లేకుండా స్త్రీ పురుష భేదం పాటించకుండా ఈరోజు తమ జీవితంలోని నిజమైన స్నేహితుడుని గురించి గుర్తుకు చేసుకుంటారు.

ఈ సందర్భంలో అనేకమంది సెలెబ్రెటీలు తమ చిన్ననాటి స్నేహితులతో చేసిన సరదాలను అదేవిధంగా వారితో చేసిన చిలిపి పనులను గుర్తుకు చేసుకుంటున్నారు. బాలీవుడ్ టాప్ హీరోయిన్ దీపికా పదుకొనె ప్రియ స్నేహితురాలు స్నేహా రాంచందర్ ఒక ప్రముఖ ఇంగ్లీష్ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో దీపికా పదుకొనె లోని చిలిపి దొంగతనం చేసే అలవాటును బయటపెట్టింది. 

చిన్నతనం నుండి చాల ప్రియస్నేహితులు అయిన వీరిద్దరి స్నేహం దీపిక టాప్ హీరోయిన్ అయిన తరువాత కూడ కొనసాగింది. దీనికితోడు దీపిక ఎప్పుడు హాలిడే ట్రిప్ కు వెళ్ళినా వీరిద్దరూ కలిసి వెళ్ళడమే కాకుండా ఆ ట్రిప్ ను ఎంజాయ్ చేస్తామని స్నేహా అప్పటి విషయాలను గుర్తుకు చేసుకుంది. తాను నటించే సినిమాకు 5 కోట్ల పారితోషికం తీసుకునే దీపికకు ఒక విచిత్రమైన అలవాటు ఉంది. అత్యంత విలాసవంతమైన హోటల్స్ లో ఉండే దీపికకు ఆ హోటల్ రూమ్ నుండి ఖాళీ చేసేడప్పుడు ఆ హోటల్ రూమ్ లో ఉన్న సబ్బులు షాంపూ బాటిల్స్ దొంగతనం చేసే అలవాటు ఉందట. 

ఈ అలవాటు చూసి ఆశ్చర్యపోయిన స్నేహ దీపికను ఇలా ఎందుకు చేస్తున్నావు అని అడిగితే చిన్నచిన్న బాటిల్స్ లో అందంగా కనిపించే ఆ షాంపు బాటిల్స్ బయట కొందాం అన్నా దొరకవు అనీ అందుకే వాటిని దొంగతనం చేస్తున్నాను అని చెప్పిందట. అంతేకాదు హోటల్ సిబ్బందికి తెలియకుండా ఆ సబ్బులను షాంపు బాటిల్స్ ను తన హ్యాండ్ బ్యాగ్ లో రహస్యంగా దొంగతనం చేసి పెట్టుకున్న ఆనందం తనకు మరెక్కడా దొరకదు అంటూ ఆమె చెప్పిన చిలిపి మాటలను గుర్తుకు చేసుకుంటూ ఈ ‘ఫ్రెండ్ షిప్ డే’ రోజున స్నేహా రాంచందర్ దీపికకు శుభాకాంక్షలు తెలియచేసింది..  


మరింత సమాచారం తెలుసుకోండి: