ఆంధ్ర ప్రదేశ్ లో మరో 5 ఏళ్ళ వరకు ఎన్నికలు జరిగే ఆస్కారం లేకపోయినా 2024 ఎన్నికలలో జరగబోయే విషయాల పై కొందరు ఇప్పటినుంచే అంచనాలు వేయడం మొదలుపెట్టేసారు. ఈనేపధ్యంలో ప్రముఖ జ్యోతిష్కుడు సంఖ్యా శాస్త్రవేత్త వేణు స్వామి ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జూనియర్ ఎన్టీఆర్ జాతకం పై చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. 

జూనియర్ జాతక చక్రంలో ఉన్న గ్రహస్థితి రీత్యా అతడు రాజకీయాలలోకి వచ్చి పెను ప్రభంజనం సృష్టించే ఆస్కారం ఉంది అన్న అభిప్రాయం వేణు స్వామి వెల్లడిస్తున్నాడు. అయితే జూనియర్ కు రాజకీయాలలోకి రావాలని కోరిక బలంగా ఉండాలని అటువంటి కోరిక ఉన్నప్పుడు మాత్రమే జాతక చక్రంలోని గ్రహాలూ సహకరిస్తాయి అంటూ తన అభిప్రాయం తెలియచేసాడు. 

పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ రాజకీయ అధికార యోగం లేదు అన్న విషయం తాను గతంలోనే చెప్పాను అంటూ 2024 ఎన్నికలలో మాత్రం పవన్ కొంత వరకు మెరుగైన ఫలితాలు సాధించే ఆస్కారం ఉంది అని అంటున్నాడు. ఇక జూనియర్ తన తాతలా ఒక కొత్త పార్టీని స్థాపించి జనంలోకి వెళితే జనం బ్రహ్మరధం పట్టడం ఖాయం అంటూ తన అంచనాలు తెలియచేసాడు. 

జూనియర్ పవన్ ల వ్యక్తిత్వాన్ని సరిపోలుస్తూ మంచితనంలో పవన్ వ్యక్తిత్వాన్ని అందుకోగల రాజకీయ నాయకులు ఎవరు ప్రస్తుతం లేరనీ నిరాడంబరమైన జీవన శైలి అనుసరించడంలో పవన్ వ్యక్తిత్వం ముందు ఎవరు సరిపోరు అంటూ తన అభిప్రాయాన్ని తెలియచేసాడు. ఒకవైపు జూనియర్ రాజకీయాలకు తాను దూరం అంటూ అనేకసార్లు చెపుతున్న పరిస్థితులలో రానున్న రోజులలో వేణు స్వామి చెప్పిన భవిష్యవాణి విని తారక్ ఆలోచనలలో ఏమైనా మార్పులు వస్తాయేమో చూడాలి. గతంలో ఇదే వేణు స్వామి పవన్ గురించి చెప్పిన జాతకం పై పవన్ అభిమానులు అతడిని విపరీతంగా టార్గెట్ చేసారు. ఇప్పుడు తారక్ అభిమానులు వేణు స్వామి చెప్పిన ఈ జాతక ఫలితాలను ఎంతవరకు సీరియస్ గా తీసుకుంటారో చూడాలి..   


మరింత సమాచారం తెలుసుకోండి: