విక్టరీకి మారుపేరు వెంకటేష్.  తన తొలిసినిమాలోనే విక్టరీ కి మారుపేరు విజయ్ అని చెప్పించి దాన్నే తన పేరుకు ముందు వేసుకున్నారు.  వెంకటేష్ తన కెరీర్లో ఎన్నో సినిమాలు చేశారు.  ఫ్యామిలీ హీరోగా పేరు తెచ్చుకున్నారు.  తరువాత కామెడీ ప్రధానమైన సినిమాల్లో తనదైన మ్యాజరిజంతో ఆకట్టుకున్నాడు. ఇలా ఎన్నో బహుముఖ చిత్రాల్లో నటించిన వెంకటేష్ తన మొదటిసినిమాలో ఓ సాహసం చేశారు. ఇప్పుడైతే వాటిని సిజి వర్క్స్ లో మ్యానేజ్ చెయ్యొచ్చు.  


కానీ, అప్పట్లో అలా కుదరదు.  సీజీ వర్క్స్ చేయడం సాధ్యం కాదు.  నిజమైన వాటిని వాడాలి లేదంటే సీన్ పక్కన పెట్టాలి.  వెంకటేష్ మొదటి సినిమా కలియుగ పాండవులు సినిమా క్లైమాక్స్ లో ఓ సీన్ ఉంటుంది.  వెంకటేష్ ను తాళ్లతో ఓ చెక్క కట్టేస్తారు.  అక్కడ సీన్ ఏంటంటే.. వెంకటేష్ ను తాళ్లతో కట్టేసినపుడు చెక్కపైన ఓ రాబందువు ఉంటుంది.  అది వెంకటేష్ మెడను పొడిచి మాసం తినాలి.  అది సీన్.  మాములుగా ఇప్పుడు గ్రాఫిక్స్ లో మేనేజ్ చెయ్యొచ్చు. ఇప్పుడు అది కుదరదు.  


అందుకే నిజమైన రాబందువును తీసుకొచ్చి వెంకటేష్ ను కట్టేసిన చెక్కపై ఉంచారు.  ఆ చెక్క వెనక భాగంలో మాంసం ముక్కను ఉంచారు.  దాన్ని అది పొడుచుకు తింటుంది.  ఎంత మాంసం ముక్క వెనక పెట్టి మ్యానేజ్ చేసినా.. రాబందువును చూస్తే ఎవరికైనా కాస్తంత భయం వేస్తుంది కదా. 

అది మామూలే.  వెంకటేష్ కూడా అలానే భయపడ్డారు.  ఎక్కడ నిజంగానే మెడను పొడుస్తుందో అని సందేహించాడు. ఫైట్ మాస్టర్ విజయ్ మాత్రం వెంకటేష్ కు ధైర్యం చెప్పాడు.  ఆ సీన్ చాలా అద్భుతంగా వచ్చింది.  సినిమా సూపర్ హిట్టైంది.  ఈ సినిమాలో వెంకటేష్ చేసిన సాహసం మెచ్చుకోదగ్గది.  ప్రస్తుతం వెంకటేష్ వెంకిమామ సినిమా చేస్తున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: