కింగ్  నాగార్జున , 'చి ల సౌ' ఫేమ్  రాహుల్ రవీంద్రన్ కలయికలో  తెరకెక్కిన  చిత్రం మన్మథుడు 2.  అన్ని కార్యక్రమాలను  ముగించుకొని విడుదలకు సిద్దమవుతుంది ఈ చిత్రం.  ఇక ఈసినిమా ట్రైలర్ చూస్తే అడల్ట్ సినిమా అని అర్థమవుతుంది.  అయితే సెన్సార్ నుండి మాత్రం  యూ /ఏ సర్టిఫికేట్ తెచ్చుకుంది ఈ చిత్రం. అందుకోసం బోర్డు చెప్పినివన్నీ చేసారు మూవీ మేకర్స్. 


ఈసినిమా  ఫ్రెంచ్ మూవీ 'ఐ డు' కి రీమేక్ గా తెరకెక్కినది కావడంతో  సినిమాలో బూతు పదాలు వాడడం కామన్. అయితే  సెన్సార్ ఆ పదాలను అన్నింటిని మ్యూట్ చేయించిందట.  ఒక 6నుండి 7 పదాల వరకు మ్యూట్ చేశారని సమాచారం. అలాగే రకుల్ ప్రీత్ , ఝాన్సీ ని ముద్దు పెట్టుకొనే సన్నివేశాన్నికూడా  బ్లర్ చేశారట. మరి ఈ సినిమాకి   ఫ్యామిలీ ఆడియెన్స్ ఎంత వరకు కనెక్ట్ అవుతారో చూడాలి. 


 ఇక  ఈ చిత్రంలో నాగ్ కు జోడిగా  రకుల్ ప్రీత్ సింగ్ నటించగా  కన్నడ హాట్ బ్యూటీ  అక్షరా గౌడ , వెన్నల కిషోర్,రావు రమేష్ , లక్ష్మి  ముఖ్య పాత్రల్లో నటించారు. వీరితో పాటు సమంత కూడా ఓ స్పెషల్ రోల్ లో కనిపించనుంది.  ఆర్ఎక్స్ 100 ఫేమ్ చైతన్ భరద్వాజ్ సంగీతం అందించిన  ఈ చిత్రాన్ని నాగార్జున , జెమిని కిరణ్ సంయుక్తంగా  నిర్మించారు. ఆగస్టు  9న ఈ చిత్రం ప్రేక్షకులముందుకు రానుంది.  కాగా గత ఏడాది ఆఫీసర్  తో షాక్ తిన్న నాగార్జున ఆ తరువాత నాని తో కలిసి దేవదాస్ అనే మల్టీ స్టారర్ సినిమాలో నటించాడు. ఆ సినిమా కూడా యావరేజ్ గానే ఆడింది. మరి ఇప్పుడు మన్మథుడు 2 తోనైనా నాగ్  సక్సెస్ ట్రాక్  ఎక్కుతాడో  లేదో  తెలియాలంటే మరో రెండు రోజులు వేచి చూడాల్సిందే. 



మరింత సమాచారం తెలుసుకోండి: