ఈమధ్య కాలంలో సినిమాలో కంటెంట్ కంటే బూతులు ఎక్కువగా ఉంటున్నాయి.  ఈ బూతుల కారణంగా సినిమాలు హిట్ అవుతున్నాయి.  అందుకు అర్జున్ రెడ్డి, ఆర్ఎక్స్ 100 సినిమాలు ఒక ఉదాహరణ.  బూతు తో పాటు మసాలా గ్లామర్ జోడించడంతో యూత్ ఎక్కువగా థియేటర్లకు వస్తున్నారు.  అయితే, ఇలా థియేటర్లకు రావడం వెనుక కారణాలు ఏవైనా కావొచ్చు..  కేవలం బూతు కంటెంట్ వలనే సినిమా థియేటర్లలో సినిమా రిలీజ్ అవుతుంది.  ఈ కంటెంట్ కారణంగానే సినిమాలు ఆడుతున్నాయి అనుకుంటే పొరపాటే.  



కేవలం ఏ రేటెడ్ కంటెంట్ కారణంగానే సినిమాలు హిట్ అవుతాయి అంటే.. చాలా సినిమాలు అలానే హిట్ కావాల్సి ఉన్నది.  కంటెంట్ ఉంటేనే సినిమా లేందంటే ఎంత పెద్ద సినిమా అయినా సరే బాక్సాఫీస్ వద్ద చతికలు పడాల్సిందే.  అందుకు వేరే మార్గం లేదు.  అర్జున్ రెడ్డి సినిమా విషయంలో అదే జరిగింది.  అర్జున్ రెడ్డిలో కంటెంట్ కొత్తగా ఉన్నది.  సినిమా మేకింగ్ కొత్తగా ఉన్నది అందుకే హిట్టైంది.  



అలానే ఆర్ఎక్స్ 100 సినిమా కూడా అంతే.  సినిమా మేకింగ్ కొత్తగా ఉన్నది.  సాడ్ ఎండింగ్ అయినప్పటికీ సినిమా బాగుండటంతో హిట్ కొట్టింది.  నవరసాలు ఉంటేనే సినిమా.  ఇదంతా ఎందుకు చెప్పాల్సి  వచ్చింది అంటే.. నాగార్జున మన్మధుడు 2 సినిమా ఆగష్టు 9 వ తేదీన రిలీజ్ కాబోతున్నది.  నాగార్జున సినిమాల్లో బూతు కంటే తక్కువగా ఉంటుంది.  అసభ్య  పదజాలం పెద్దగా వాడేవారు కాదు.  కానీ, మన్మథుడు 2 సినిమాలో  శృతిమించిన బూతు డైలాగులు ఉన్నాయని, వాటిని బీప్ సౌండ్ తో మ్యానేజ్ చేశారని టాక్ వస్తోంది.  ఈస్థాయిలో బూతు కంటెంట్ ఉంటె ఎలా కష్టం అవుతుంది కదా మరి.  నాగ్ లాంటి సీనియర్ హీరో సినిమాలో అలాంటి డైలాగులు ఉండటం ఏంటి.  హిట్ కోసం ఇలా బూతు వాడతారా? చూద్దాం సినిమా ఏ విధంగా ఉంటుందో.. 


మరింత సమాచారం తెలుసుకోండి: