అక్కినేని హీరోల్లో నాగార్జున దూసుకుపోతున్నారు.  సోగ్గాడే చిన్నినాయన తరువాత మరో హిట్ కోసం రెడీ అవుతున్నారు.  ఆఫీసర్ సినిమా ఫెయిల్ కావడంతో సోలో హిట్ కోసం ట్రై చేస్తున్నాడు ఈ మన్మథుడు.  దేవదాస్ సినిమా వచ్చినా అది ముల్టీస్టారర్ సినిమా కావడంతో క్రెడిట్ ను నానితో కలిసి పంచుకోవాల్సి వచ్చింది.  కాగా ఈసారి తప్పకుండా హిట్ కొడతాననే ధీమాతో ఉన్నాడు.  అందుకే యూత్ కు నచ్చే అన్ని అంశాలతో ఆగస్టు 9 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.  



మన్మథుడు 2 లో బూతు పదాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది.  కంప్లీట్ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకేకించిన ఈ మూవీపై అంచనాలు ఉన్నాయి.  నాగార్జున తన కెరీర్లో ఎన్నో విజయాలు సాధించారు. ఈ సినిమాకు పాజిటివ్ వైబ్ క్రియేట్ అయ్యింది.  దానికి తగ్గట్టుగా టాక్ వస్తే సినిమా బంపర్ హిట్ కావడం ఖాయం.  అయితే, ఈ సినిమాను నాగార్జున కాకుండా అఖిల్ తో చేయిస్తే బాగుండేదని కొందరి వాదన.  



నాగ్ పెద్దబ్బాయి నాగ చైతన్య హిట్స్ కొడుతున్నాడు.  కెరీర్లో స్టాండ్ అయ్యాడు.  అటు కోడలు సమంత వరసగా హిట్స్ కొడుతూ దూసుకుపోతున్నది.  పెళ్లి తరువాత కూడా ఆమె దూకుడు ఆగలేదు.  అక్కినేని వారసుల్లో ఎవరైనా వెనకబడి ఉన్నారా అంటే అది అఖిల్ అనే చెప్పాలి.  అఖిల్ ఇప్పటి వరకు మూడు సినిమాలు చేశారు.  మూడు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి.  ప్రస్తుతం అఖిల్ నాలుగో సినిమా చేస్తున్నాడు.  బొమ్మరిల్లు భాస్కర్ దర్శకుడు.  గీతా ఆర్ట్స్ బ్యానర్ కాబట్టి సినిమాపై నమ్మకం ఉన్నది.  



మన్మధుడు 2 సినిమా నాగ్ చేయకుండా, కోడు అఖిల్ తో చేయించినట్టైతే బాగుండేది.  అఖిల్ చేసిన మిస్టర్ మజ్ను సినిమా ఇలానే ఫెయిల్ అయ్యింది కాబట్టి మన్మథుడు 2 సినిమా వెంటనే చేస్తే బాగుండదు అనుకుంటే... నాగచైతన్యకు అయినా ఈ సినిమా ఇచ్చి ఉండాల్సింది.  60 ఏళ్ల వయసులో ఇలాంటి రొమాంటిక్ యాంగిల్ సినిమాలంటే జీర్ణించుకోవడం కాస్త కష్టమే.  తెరపై ఎలా కనిపిస్తారో చూడాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: