నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన మన్మథుడు2 సినిమా రేపు విడుదల కాబోతుంది. ఇప్పటికే సెన్సార్ పూర్తయిన ఈ సినిమా యు/ఎ సర్టిఫికెట్ సెన్సార్ సభ్యుల నుండి అందుకుంది. సెన్సార్ టాక్ ప్రకారం ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్ పుష్కలంగా ఉండబోతుందని తెలుస్తుంది.ఈ సినిమాకు పోటీగా అనసూయ ప్రధాన పాత్రలో నటించిన కథనం సినిమా విడుదల కాబోతుంది. ఈ రెండు సినిమాలతోపాటు రేపు ఎన్టీయార్ నటించిన టెంపర్ తమిళ్ రీమేక్ ఆయోగ్య కూడా విడుదల కాబోతున్నట్లు తెలుస్తుంది. 
 
2014లో ఎన్టీయార్ హీరోగా విడుదలైన టెంపర్ సినిమా ఎంత పెద్ద హిట్టో తెలిసిందే. వరుస ఫ్లాపుల్లో ఉన్న హీరో ఎన్టీయార్, డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ఇద్దరూ ఈ సినిమాతో హిట్ కొట్టారు. టెంపర్ రీమేక్ హిందీలో సింబాగా విడుదలై సక్సెస్ సాధించింది. టెంపర్ సినిమా తమిళ్ రీమేక్లో విశాల్ హీరోగా, రాశి ఖన్నా హీరోయిన్లుగా నటించారు. మొదట విశాల్ ఈ సినిమాను తెలుగులో విడుదల చేయనని చెప్పినప్పటికీ ఆ తరువాత మాత్రం మాట మార్చారు. 
 
ఆయోగ్య సినిమా మే నెలలో తమిళంలో విడుదలై హిట్ అయింది. గత నెలలోనే ఈ సినిమాను విడుదల చేస్తామని ప్రకటించినా ఎందుకో విడుదల చేయలేదు. ఇప్పుడు కూడా ఈ సినిమాను సరైన పబ్లిసిటీ లేకుండానే విడుదల చేస్తున్నారు. బుక్ మై షో వెబ్ సైట్లో ఆయోగ్య అడ్వాన్స్ బుకింగ్ ఇప్పటికే మొదలైంది. కానీ బుకింగ్స్ అంత ఆశాజనకంగా లేవని తెలుస్తోంది. 
 
ఆయోగ్య సినిమాలో ఒక్క క్లైమాక్స్ తప్ప మిగతా సినిమా అంతా టెంపర్ లాగానే ఉంటుంది. ఇప్పటికే ఆయోగ్య తమిళ్ డిజిటల్ వెర్షన్ కూడా అందుబాటులోకి వచ్చింది. పందెంకోడి2, అభిమన్యుడు సినిమాలతో వరుసగా హిట్లు కొట్టిన విశాల్ ఆయోగ్య సినిమాతో హిట్టు కొడతాడో లేదో చూడాలి. ఈ సినిమాకు వెంకట్ మోహన్ దర్శకత్వం వహిస్తున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: