రెండు వారాల క్రిందట ప్రారంభమైన బిగ్ బాస్ షోలో మొదటివారం సినీ నటి హేమ ఎలిమినేట్ కాగా రెండవ వారం ప్రముఖ జర్నలిస్ట్ జాఫర్ ఎలిమినేట్ అయ్యారు. ఎలిమినేట్ అయిన తరువాత ఒక ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చాడు జాఫర్. ఈ షోలో 15 రోజుల జర్నీ చాలా బాగుందని ఇంటర్వ్యూలో అన్నారు జాఫర్. బిగ్ బాస్ షోకు నేను ఎలాంటి స్ట్రాటెజీతో వెళ్ళలేదని బిగ్ బాస్ సీజన్ 2 లోనే అవకాశం వచ్చిందని కానీ కొన్ని కారణాల వలన వెళ్ళలేకపోయానని జాఫర్ చెప్పారు. 
 
ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నేను నాలానే ఉన్నానని అన్నారు జాఫర్. మిగతా సీజన్లకు ఈ సీజన్లకు తేడా ఉందని గత సీజన్లలా కాకుండా 12 రోజుల తరువాత కెప్టెన్సీ టాస్క్ పెట్టారని, ఎదుటివారిని ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నించమని, గొడవలకు పోవొద్దని, అవతలి వాళ్ళ మనసు గెలుచుకోవటానికి ప్రయత్నించమని బిగ్ బాస్ చెప్పారని జాఫర్ అన్నారు. బిగ్ బాస్ హౌస్లో ప్రెజర్ కుక్కర్ లాంటి వాతావరణం ఉంటుందని చెప్పారు జాఫర్. 
 
వరుణ్ సందేశ్ లాస్ట్ వీక్ ఎలిమినేషన్ కు నామినేట్ చేసానని చెప్పాడని బిగ్ బాస్ హౌస్లో ఉన్నన్ని రోజులు నామినేట్ చేస్తానని రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసాడని అన్నాడు జాఫర్. వరుణ్ సందేశ్, పునర్నవి, రాహుల్ సిప్లిగంజ్, వితిక ఒక గ్రూపుగా ఉన్నారని అన్నారు జాఫర్. ఇంట్లోకి ఎంట్రీ ఇవ్వగానే వితికా షేరు 24 కిస్సెస్ సినిమా ఇంటర్వ్యూ చాలా దారుణంగా అడిగారని నేను హర్ట్ అయ్యానని చెప్పిందని జాఫర్ అన్నారు. 
 
జాఫర్ మాట్లాడుతూ నేను వివాదాలకు చాలా దూరంగా ఉంటానని చెప్పాడు. బాబా భాస్కర్ నాకంటే 6 సంవత్సరాల చిన్నవారని ఈ షో ద్వారా ఒక మంచి మిత్రున్ని సంపాదించానని, ఒక మంచి అక్క శ్రీముఖిని సంపాదించానని అన్నారు. బాబా భాస్కర్ టైటిల్ విన్నర్ అయ్యే అవకాశం ఉందని జాఫర్ చెప్పాడు. బాబా భాస్కర్ ఎలాంటి వ్యూహం, కపటం, కల్మషం లేకుండా గేమ్ ఆడాడని, బాబా భాస్కర్ కు ఎలాంటి స్వార్థం లేదని చెప్పాడు జాఫర్. 



మరింత సమాచారం తెలుసుకోండి: