నాగార్జున మన్మథుడు 2 మూవీ ఈరోజు రిలీజ్ అవుతున్నది.  ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ప్రీమియర్ షోలు స్టార్ట్ అయ్యాయి.  సినిమాపై నమ్మకం ఉన్నది.  పాజిటివ్ వైబ్ క్రియేట్ కావడంతో అంచనాలు ఉన్నాయి.  ఇందులో నాగార్జునను కొత్తగా చూపించబోతున్నాడు రాహుల్.  చిలసౌ సినిమా చూసిన వెంటనే నాగార్జున పిలిచి బాగా తీశావని అభినందించారట.  తన దగ్గర ఓ ఫ్రెంచ్ సినిమా ఉందని చూడాలని పిలిచారట నాగ్.  



సినిమా చూసిన తరువాత బాగుందని చెప్పగా, దాన్ని రీమేక్ చేయాలనీ నాగ్ కోరడంతో రాహుల్ కాదనలేకపోయాడు.  ఆ సినిమా స్పూర్తితో మన్మథుడు 2 కథను రెడీ చేసి సినిమా స్టార్ట్ చేసినట్టు రాహుల్ పేర్కొన్నాడు.  సినిమా చాలా బాగా వచ్చిందని, 80 శాతం కామెడీ, 20 శాతం ఫీల్ గుడ్ ఉంటుందని మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు రాహుల్.  



లేటు వయసులో ముద్దులు పెట్టుకోవడం, ప్రేమలో పడిపోవడం వంటిని సినిమాలో ఉంటాయని,  ప్రేమకు వయసుతో సంబంధం లేదని అన్నారు.  సినిమా మొదలైన మొదటి పావుగంటలోనే ఆ మన్మథుడుని మరిచిపోయి కథలో లీనం అవుతారని రాహుల్ చెప్తున్నాడు.  రాహుల్ చాలా కాన్ఫిడెన్స్ గా ఉన్నారు.  అయన కాన్ఫిడెన్స్ చూస్తుంటే సినిమా హిట్ కొట్టేలానే ఉన్నది.  ఏది ఏమైనా నాగ్ వంటి సీనియర్ హీరోతో ఇలాంటి రొమాంటిక్ యాంగిల్ లో ఉండే సినిమా ప్లాన్ చేయడం అంటే మాములు విషయం కాదు.  దానికి చాలా ధైర్యం కావాలి.  



నాగ్ సైతం ఇలాంటి సినిమాలు చేయడానికి ముందుకు వచ్చారు అంటే మెచ్చుకోదగ్గ విషయమే.  నాగ్, రకుల్ ల మధ్య రొమాన్స్ అదిరిపోయినట్టు సమాచారం.  ఇందులో సమంత, కీర్తి సురేష్ లో కీరోల్ చేస్తున్నారు.  ఆ రోల్స్ ఏంటి అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే అంటున్నాడు రాహుల్.  ఇక్కడ విషయం ఏమిటంటే ఇందులో సాంగ్స్ కేవలం మూడు మాత్రమే ఉన్నాయి.  ఇప్పటికే ఈ మూడు పాటలు హిట్ కొట్టాయి.  


మరింత సమాచారం తెలుసుకోండి: