‘నా పేరు సూర్య' సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న అల్లు అర్జున్ లేటెస్ట్ గా త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తున్న సినిమాకు సంబంధించి ఆ సినిమా ప్రారంభం అయిన దగ్గర నుండి రకరకాల గాసిప్పులు హడావిడి చేస్తూనే ఉన్నాయి. ఈ పరిస్థితులలో ఈమూవీకి సంబంధించి మరో లేటెస్ట్ గాసిప్ ఇప్పుడు ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. తెలుస్తున్న సమాచారం మేరకు ఒక  ఐటమ్ సాంగ్ విషయమై వీరిద్దరి మధ్య తీవ్ర అభిప్రాయభేదాలు ఏర్పడినట్లు టాక్.

ప్రస్తుతం కాకినాడ చుట్టుపక్కల ప్రాంతంలో షూటింగ్ జరుపుకుంటున్న ఈమూవీ షెడ్యూల్ పూర్తి అయిన వెంటనే ఒక భారీ ఐటమ్ సాంగ్ ను ఈమూవీకి సంబంధించి తీయాలని త్రివిక్రమ్ ఆలోచన అని తెలుస్తోంది. దీనికి సంబంధించి ఒక బాలీవుడ్ బ్యూటీతో కూడ త్రివిక్రమ్ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. 

అయితే ఈ ఆలోచన బన్నీకి ఏమాత్రం ఇష్టంలేదు అని అంటున్నారు. దీనికి కారణం ఈమూవీ కథలో ఐటమ్ సాంగ్ కు ఆస్కారం లేదనీ అలాంటి చోట కేవలం మాస్ ప్రేక్షకుల కోసం ఇలాంటి ఐటమ్ సాంగ్ ప్రయోగాలు చేస్తే విమర్శలు తప్ప ప్రయోజనం ఉండదు అని బన్నీ వాదిస్తున్నట్లు టాక్.  

అంతేకాదు గతంలో అల్లు అర్జున్ త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో వచ్చిన ‘జులాయి’ ‘సన్నాఫ్ సత్యమూర్తి’ సినిమాలలో ఐటమ్ సాంగ్ లేని పరిస్థుతులలో ఇప్పుడు ఈ కొత్త ప్రయోగం ఎందుకు అంటూ బన్నీ త్రివిక్రమ్ ను ప్రశ్నిస్తున్నట్లు టాక్. 'నాన్న నేను' అనే ఉదాత్తమైన టైటిల్ తో రాబోతున్న ఈమూవీలో ఐటమ్ సాంగ్ పెడితే ఈమూవీ పై విపరీతమైన సెటైర్లు పడతాయని బన్నీ భయపడి పోతున్నాడు అని అంటున్నారు. అయితే ఈవిషయాలను త్రివిక్రమ్ అంగీకరించకుండా సినిమాకు మాస్ ప్రేక్షకులు కనెక్ట్ అయి రికార్డులు రావాలి అంటే కొన్ని ఫార్మలా పద్దతులు అనుసరించాలి అని వాదిస్తున్న పరిస్థితులలో ఎవరి మాట నెగ్గుతుంది అన్న ఆసక్తి ఇండస్ట్రీ వర్గాలలో ఉంది..    


మరింత సమాచారం తెలుసుకోండి: