విలక్షణ నటుడు రాజేంద్ర ప్రసాద్ నటుడు పృథ్విని టార్గెట్ చేస్తూ వేసిన సెటైర్లు హాట్ టాపిక్ గా మారాయి. జగన్ సీఎం కావడం తెలుగు సినీ పరిశ్రమకు ఇష్టం లేదని అందుకే ఆయన సీఎం అయిన తర్వాత ఏ ఒక్కరూ వెళ్ళి  మర్యాదపూర్వకంగా కూడా కలవలేదని ఎస్‌వీబీసీ చైర్మన్ సినీ నటుడు పృథ్వీ చేసిన ఆరోపణల పై రాజేంద్రప్రసాద్ తనదైన రీతిలో కౌంటర్ ఇచ్చాడు. 

ఈరోజు  శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో రాజేంద్రప్రసాద్ ఈ కామెంట్స్ చేసాడు.   సీఎమ్ ను వెంటనే కలవడానికి సినీనటులు వ్యావారవేత్తలు కారు అని అంటూ వారికి ముఖ్యమంత్రితో వ్యక్తిగత పనులు ఏమి ఉండవని కామెంట్స్ చేసాడు. అంతేకాదు కళాకారులు సినిమా నటులు  సీఎమ్ ను కలవాలన్న నిబంధన ఎక్కడ ఉంది అంటూ ఎదురు ప్రశ్నలు వేసాడు. 

అయితే రాజేంద్రప్రసాద్ ఇక్కడ  ఊహించని మరో ట్విస్ట్ ఇస్తూ జగన్ సీఎంగా సెటిల్‌ అయిన తర్వాత సినిమా ప్రముఖులు ముఖ్యమంత్రిని కలిసే అవకాసం ఉంది అంటూ కామెంట్స్ చేస్సాడు. అయితే ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీకి జగన్‌ తో మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఇద్దరు సీఎమ్ లు సినీపరిశ్రమ పట్ల సానుకూలంగా ఉన్నారని ఈ విషయాల పై వివాదాలు అనవసరం అంటూ రాజేంద్ర ప్రసాద్ కామెంట్స్ చేసాడు. 

ప్రజలకు తాగునీరందించే సీఎమ్ తన దృష్టిలో దేముడు అంటూ కామెంట్స్ చేసిన రాజేంద్రప్రసాద్ వాస్తవానికి తాను   సీఎమ్ జగన్‌ ను రేపు కలవాల్సి ఉన్నప్పటికీ ఇతరత్రా కారణాలవల్ల  ఆసమావేశం వాయిదా పడిన విషయాన్ని వివరిస్తూ మరో రెండుమూడు రోజుల్లో జగన్ ను కలవబోతున్నట్లు లీకులు ఇచ్చాడు. దీనితో రాజేంద్రప్రసాద్ వ్యూహాత్మకంగా పృథ్వి మాటలకు కౌంటర్ ఇస్తూనే తానుకూడ జగన్ అభిమాని అంటూ వ్యూహాత్మక సంకేతాలు ఇస్తున్నాడు.. 



మరింత సమాచారం తెలుసుకోండి: