టాలీవుడ్ లో మంచు కుటుంబం తనదైన గుర్తింపు తెచ్చుకుంది. కొన్ని ఫ్యామిలీ హిట్ సినిమాలతో హీరో మంచు విష్ణుకు ఓ కంప్లీట్ ఫ్యామిలీ మ్యాన్ అనే ఇమేజ్ ను తెరకెక్కించుకున్నాడు. నిజ జీవితంలోనూ ఒక కంప్లీట్ ఫ్యామిలీ మనిషిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. తనకు ఏమాత్రం సమయం దొరికినా కుటుంబంతో సమయం గడిపేందుకు ఆసక్తి చూపిస్తారు.



సతిమణి విరోనికా పిల్లలూ వివియానా అభియాన్ అవ్రామ్  తో సమయం గడుపుతూ వుంటాడు. అప్పుడప్పుడూ తన ఫ్యామిలీ ఫోటోలు కూడా సోషల్ మీడియా ఖాతాల ద్వారా షేర్ చేస్తూ వుంటాడు. విష్ణు విరోనికా జంటకు త్వరలో తమ ప్రేమకు ప్రతిరూపం అయిన నాల్గవ సంతానం రాబోతోంది. విరోనికా ప్రస్తుతం ప్రెగ్నెంట్ కావడంతో మంచు కుటుంబమంతా తమ కొత్త కుటుంబ వారసుల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలో విష్ణు తన ట్విట్టర్ ఖాతా ద్వారా పంచుకున్న అంశం ఒకటి  హాట్ టాపిక్ గా మారింది.


ప్రముఖ హీరోయిన్ అయిన కాజల్ తో తీవ్రంగా చర్చోపచర్చలు జరిపి ఒక నిర్ణయానికి వచ్చామని, విరోనికా డెలివరీని ఇన్ స్టాగ్రామ్ లో లైవ్ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నానని ఆ ట్వీట్లో పేర్కోన్నారు. ఆ ట్వీట్ తో నెటిజన్ లకు ఫ్యూజులు ఎగిరి పోయాయి. కాస్త ఘాటు భాషలోనే విష్ణుపై కొందరు నెటిజన్ లు విరుచుకుపడ్డారు. వివిధ రకాల సెటైర్ లతో పంచులతో ట్రోల్స్ చేశారు. ఇది ఇలా ఉంటే విష్ణు సతిమణి ఆ డెలివరీ లైవ్ ట్వీట్ కు స్పందిస్తూ అవును 'నిన్ను నేను ఇంట్లోంచి తరిమేయబోతున్న అని, కాజల్ అగర్వాల్ ఇది నిన్ను ఉద్దేశించినది కాదులే ' అంటూ గట్టిగా మామగారు మోహన్ బాబు స్టైల్లో వార్నింగ్ ఇచ్చింది మన విరోనికా.



చేసేది ఏమీ లేక హోమ్ డిపార్ట్ మెంట్ నుండి హెచ్చరిక జారీ అయితే ఎంత పెద్ద హీరో అయినా తప్పని సరిగా భార్యామణి చెప్పినట్టు ఫాలో అవుతాడు. మన విష్ణు కూడా ఒక ఆదర్శ భర్త తరహాలో విరోనికా నుంచీ వైలెంట్ ట్వీట్స్ కారణంగా ఇన్ స్టాగ్రామ్ లైవ్ ఆలోచన మానుకున్నాడు. తాను ఆమెతో గొడవపెట్టుకున్నా విరోనికాకు మోహనబాబుగారి సంపూర్ణ మద్దతు ఉంది అంటూ ఓటమిని అంగీకరించాడు ఉత్తమ భర్త విష్ణు. ఏదేమైనా మంచు ట్వీట్ తో ట్విట్టర్ తో రకరకాల వార్తలతో హాట్ టాపిక్ గా మారింది ఈ విషయం.






మరింత సమాచారం తెలుసుకోండి: