బిగ్ బాస్ సీజన్ 3లో వైల్డ్ కార్డ్ ద్వారా తమన్నా సింహాద్రి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. నిజానికి బిగ్ బాస్ షో ప్రారంభం కాకముందే తమన్నా సింహాద్రి ఈ షోలో పాల్గొంటున్నారని వార్తలు వచ్చాయి. ఆ వార్తలు నిజం చేస్తూ వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చింది తమన్నా సింహాద్రి. మొదట్లో తమన్నా సింహాద్రి బిగ్ బాస్ హౌస్లో బాగానే ఉన్నా ఆ తరువాత బిగ్ బాస్ ఇంటి సభ్యులతో అనసరంగా వివాదాలు సృష్టించుకుంది. 
 
గత వారం బిగ్ బాస్ టాస్క్ ఇచ్చిన సమయంలో అలీ రేజాతో గొడవ పడింది తమన్నా. అలీ రేజా ఏమీ అనకపోయినప్పటికీ ఇష్టం వచ్చినట్లుగా కామెంట్లు చేసింది తమన్నా సింహాద్రి. సీరియల్ నటుడు రవికృష్ణ తమన్నా సింహాద్రిని ఎలిమినేషన్ కు నామినేట్ చేయడంతో రవికృష్ణపై దారుణమైన వ్యాఖ్యలు చేసింది తమన్నా. బిగ్ బాస్ హౌస్లోని మిగతా సభ్యులు ఎంత వారించినా తమన్నా సింహాద్రి మాత్రం వినలేదు. 
 
బిగ్ బాస్ హౌస్ లో తమన్నా సింహాద్రి ఇలా చేయటంతో ఈమె పట్ల ప్రేక్షకుల్లో అసహనం వ్యక్తం అవుతుంది. అందువలన కొంతమంది నెటిజన్లు సోషల్ మీడియాలో హీరోయిన్ తమన్నాను ట్యాగ్ చేసి కామెంట్లు చేస్తున్నారట. ఇద్దరి పేర్లు తమన్నా కావటంతో నెటిజన్లు పొరపాటు పడి ఇలా చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇలా హీరోయిన్ తమన్నాకు నెగటివ్ కామెంట్లతో ట్వీట్లు వస్తూ ఉండటంతో తమన్నా సోషల్ మీడియాకు దూరంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. 
 
బిగ్ బాస్ హౌస్లో తమన్నా సింహాద్రి ప్రవర్తన బిగ్ బాస్ ఇంటి సభ్యులకు, ప్రేక్షకులకు విరక్తి తెప్పించే విధంగా ఉంది. ఈ వారం ఎలిమినేషన్ కు నామినేట్ అయిన ఇంటి సభ్యుల్లో తమన్నా సింహాద్రి కూడా ఉన్నారు. అనధికారిక పోల్స్ ప్రకారం తమన్నా సింహాద్రి ఈ వారం ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: