హృదయ కాలేయం సినిమాతో టాలీవుడ్లో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు సంపూర్ణేష్ బాబు. హృదయ కాలేయం సినిమా కథ, కథనం వినోదాత్మకంగా ఉంటూనే రోటీన్ కథలకు భిన్నంగా ఉండటంతో హృదయ కాలేయం సినిమా సూపర్ హిట్ అయింది. హృదయ కాలేయం సినిమా తరువాత సింగం123 సినిమాలో సంపూర్ణేష్ బాబు హీరోగా నటించాడు. కానీ ఆ సినిమా డిజాస్టర్ అయింది. మధ్యలో కొన్ని సినిమాల్లో సంపూర్ణేష్ బాబు ప్రత్యేక పాత్రల్లో నటించినా ఆ సినిమాలేవీ సంపూర్ణేష్ బాబుకు పెద్దగా గుర్తింపు ఇవ్వలేకపోయాయి. 
 
నాలుగేళ్ళ క్రితం సంపూర్ణేష్ బాబు హీరోగా మొదలైన కొబ్బరిమట్ట సినిమా రిలీజ్ డేట్ చాలా సార్లు వాయిదా పడి ఈరోజు విడుదలైంది. కొబ్బరిమట్ట టీజర్, ట్రైలర్ ప్రేక్షకుల్ని ఆకట్టుకోవటంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు పెరిగాయి. సంపూర్ణేష్ బాబు ఈ సినిమాలో పెదరాయుడు అనే పేరుతో గ్రామ పెద్ద పాత్రలో నటిస్తున్నాడు. ప్రశాంతంగా సాగుతున్న పెదరాయుడు జీవితంలో కొడుకునంటూ ఆండ్రాయుడు(సంపూర్ణేష్ బాబు)  వచ్చి తనకు జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకుంటానని పెదరాయుడుతో శపథం చేస్తాడు. పెదరాయుడు, ఆండ్రాయుడు మధ్య ఉన్న సంబంధం ఏమిటి? ఆండ్రాయుడు పెదరాయుడుపై చేసిన శపథం నెరవేర్చుకున్నాడా? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ కథ. 
 
ఈరోజు విడుదలైన ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో పాజిటివ్ టాక్ వినిపిస్తుంది. సంపూర్ణేష్ బాబు హృదయ కాలేయం సినిమా తరువాత ఆ రేంజ్ హిట్ కొట్టాడని పబ్లిక్ టాక్ వినిపిస్తుంది. కథ, కథనం విషయాల్లో హృదయ కాలేయం సినిమాలాగే సెటైరికల్ కామెడీతో కొబ్బరిమట్ట సినిమా తీసారు. నిన్న నాలుగు సినిమాలు విడుదలైనప్పటికీ ప్రేక్షకుల్ని ఏ ఒక్క సినిమా ఆకట్టుకోకపోవటంతో కొబ్బరిమట్ట సినిమాకు కలెక్షన్లు కూడా భారీగానే వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. వరుసగా మూడు రోజులు సెలవులు ఉండటం కొబ్బరిమట్ట సినిమాకు కలిసొచ్చే అంశంగా చెప్పవచ్చు. 


 
 



మరింత సమాచారం తెలుసుకోండి: