సాహో సినిమాకు సంబంధించిన న్యూ లుక్ ను ఈరోజు ఉదయం యూనిట్ రిలీజ్ చేసింది.  క్లైమాక్స్ ఫైట్ కు సంబంధించిన లుక్ అది.  ప్రభాస్ స్టాండ్ పొజిషన్స్ లో రెడీ గా ఉంటె వెనకనుంచి సైతాన్ కా గ్యాంగ్ కత్తులు కటార్లు పట్టుకొని పరిగెత్తుకుంటూ వస్తుంటారు.  రెడీ అటాక్ అన్నట్టుగా ఉన్నది ఆ ఫోటో. క్లైమాక్స్ ఫైట్ ను దుబాయ్ ఎడారిలో చిత్రీకరించినట్టు ఇప్పటికే చెప్పారు.  చెప్పడమే కాదు..దుబాయ్ ఎడారిలో ఓ సెట్ ను కూడా నిర్మించినట్టు యూనిట్ తెలిసింది.  ఆ సిటీకి ఏమని పేరు పెట్టారు అన్నది సినిమాలోనే చూడాలట.  



అయితే, రీసెంట్ గా రిలీజ్ చేసిన ఫొటోను చూస్తుంటే.. రామ్ చరణ్ వినయ విధేయ రామ క్లైమాక్స్ సీన్ గుర్తుకు వస్తున్నది.  అందులో రామ్ చరణ్ లుక్ కూడా ఇంచుమించుగా ఇలానే ఉంటుంది.  కాకపోతే రామ్ చరణ్ షర్ట్ తీసేసి ఉంటాడు.. ఇక్కడ అలా లేదు అంతే తేడా.. అందులో కూడా క్లైమాక్స్ లో భారీ ఫైటర్స్ వెనకనుంచి వస్తుంటారు.  షాట్స్ కూడా  సాహో ఫొటోలో ఉన్నట్టుగా ఉన్నది. 



వినయవిధేయ రామ సినిమాకు కూడా విపరీతమైన క్రేజ్ వచ్చింది.  సినిమా సూపర్ హిట్ అవుతుందని ముందునుంచి టాక్ వచ్చింది.  ఆ క్రేజ్ ను మూవీ క్యాష్ చేసుకోలేకపోయింది.  మితిమీరిన హింసతో సినిమా బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయ్యింది.  సినిమాకు ముందు భారీ క్రేజ్ ను సంపాదించుకున్న కొన్ని సినిమాలు మాత్రమే హిట్టయ్యాయి.  కొన్ని మాత్రం దారుణంగా ఫెయిల్ అయ్యాయి. 



రాజమౌళి సినిమాలకు ముందు నుంచి హైప్ వస్తుంది.  వచ్చినట్టుగానే సినిమా రిలీజ్ అయ్యాక సూపర్ హిట్ అవుతుంది.  కథ మారినా రాజమౌళి ఫార్ములా మారదు.  ఆడియన్స్ నాడిని పట్టుకోవడంలో ముందు ఉంటాడు.  అందుకే రాజమౌళి సినిమాలు  బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాలు సొంతం చేసుకుంటుంటాయి.  ఆర్ఆర్ఆర్ మూవీ కూడా అదే విధంగా హైప్ క్రియేట్ అయ్యింది.  మరి ఈ మూవీ ఎలా ఉంటుందో తెలియాలంటే రిలీజ్ వరకు ఆగాల్సిందే.  


మరింత సమాచారం తెలుసుకోండి: