టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున తన కెరీర్లో అత్యంత గడ్డు పరిస్థితులు వ‌రుస‌గా ఎదుర్కొనే ప‌రిస్థితి. సోగ్గాడే చిన్ని నాయ‌న త‌ర్వాత కాస్త ట్రాక్‌లోకి ఎక్కిన‌ట్టు క‌న‌ప‌డిన నాగార్జున కెరీర్‌లో వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఆఫీస‌ర్ సినిమా పెద్ద మాయ‌ని మ‌చ్చ‌గా మిగిలిపోయింది. ఆఫీస‌ర్ దెబ్బ‌తో నాగ్ మార్కెట్‌, ఇమేజ్ రెండూ ఘోరంగా దెబ్బ‌తిన్నాయి. ఆ సినిమా నాగ్‌ను చాలా రోజుల వ‌ర‌కు కోలుకోనివ్వ‌లేదు.


నాగ్ ఆఫీస‌ర్ దెబ్బ నుంచి కోలుకునేందుకు చేసిన ప్ర‌య‌త్నాలు కూడా ఫ‌లిస్తున్న‌ట్టు లేవు. ఇక నాగ్ తాజాగా రాహుల్ ర‌వీంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వంలో మ‌న్మ‌థుడు 2 సినిమా చేశాడు. 17 ఏళ్ల క్రితం వచ్చిన సూపర్ హిట్ మూవీ `మ‌న్మ‌థుడు`కు సీక్వెల్‌గా వ‌చ్చిన ఈ సినిమాలో ర‌కుల్ ప్రీతి సింగ్ హీరోయిన్‌గా న‌టించింది.  నిజానికి నాగ్ కెరీర్లో 2002లో వ‌చ్చిన మ‌న్మ‌థుడు ఓ క్లాసిక్‌. ఇప్పుడు ఆ పేరు పెట్టుకుని సినిమాను చెడ‌గొట్టాడ‌ని అంద‌రూ నాగ్‌ను ఓ ఆటాడుకుంటున్నారు.


నాగార్జున కాదు... కామార్జున అని కూడా కొంద‌రు ఆడుకుంటున్నారు. అస‌లు ముస‌లోడికి ఈ వ‌య‌స్సుతో ఇంత రొమాన్స్‌, హ‌గ్‌లు, లిప్‌కిస్‌లు అవ‌స‌ర‌మా ? అని మ‌రికొంద‌రు సెటైర్లు వేస్తున్నారు. ఆఫీస‌ర్ త‌ర్వాత దేవ‌దాస్ ప్లాప్ అయ్యింది. మ‌ళ్లీ ఇప్పుడు మ‌న్మ‌థుడు 2 ఘోరంగా దెబ్బ‌తింది. షో ప‌డిందో లేదో సోష‌ల్ మీడియాలో నాగ్‌ను మామూలుగా ఆడుకోవ‌డం లేదు. 


నాగ్‌ గాలి తీసేందుకు దారుణమైన హ్యాష్ ట్యాగ్స్ ట్రెండ్ చేస్తున్నారు. బహుశా కెరీర్లో ఎన్నడూ కూడా నాగ్ ఇంత నెగెటివిటీ చూసి ఉండడేమో అనిపించే స్థాయిలో ట్రోలింగ్ నడుస్తోంది. మ‌రి కొంద‌రు ముస‌లి మ‌న్మ‌థుడు అని ఎద్దేవా చేస్తుంటే, మ‌రి కొంద‌రు మ‌న్మ‌థుడు వేస్ట్ సంపూ కొబ్బ‌రిమ‌ట్ట ఈజ్ ద బెస్ట్ అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: