2002 సంవత్సరంలో నాగార్జున, సోనాలి బింద్రే జంటగా విజయ భాస్కర్ దర్శకత్వంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటల రచయితగా వచ్చిన సినిమా మన్మథుడు. కథ, కథనం, మాటలు, కామెడీ, క్లైమాక్స్, సంగీతం ఇలా అన్ని విషయాల్లో మన్మథుడు సినిమా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ఈ సినిమాలోని త్రివిక్రమ్ మాటలకోసమే యుట్యూబ్లో చూసే ప్రేక్షకులు ఎంతోమంది ఉన్నారు. నాగార్జున సినిమా కెరీర్లోనే మన్మథుడు సినిమా ఒక క్లాసిక్ గా నిలిచింది. 
 
అలాంటి మన్మథుడు సినిమా పేరుతో నిన్న మన్మథుడు2 సినిమా విడుదలైంది. మన్మథుడు సినిమాలా ఉంటుందని ఊహించిన ప్రేక్షకులకు మన్మథుడు2 భారీ షాక్ ఇచ్చింది. ఏ విషయంలో కూడా మన్మథుడు2 సినిమా మన్మథుడు స్థాయిలో లేదు అనే విమర్శలు వస్తున్నాయి. నాగార్జున ఈ సినిమాకు మన్మథుడు2 కాకుండా వేరే టైటిల్ పెట్టి ఉంటే బాగుండేదని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. 
 
మన్మథుడు2 సినిమాలో నాగార్జున పాత్ర విషయంపై కూడా ప్రేక్షకుల నుండి విమర్శలు వస్తున్నాయి. కీర్తి సురేశ్, సమంత, రావు రమేశ్ పాత్రలు సినిమాకు ఏ విధంగా ఉపయోగపడలేదు. కేవలం సినిమాలో కొన్ని సెకన్ల పాటు ఉన్న బ్రహ్మానందం పాత్ర పూర్తిగా వృథా అయింది. సంగీతం విషయంలో కూడా మన్మథుడు2 సినిమా పూర్తిగా విఫలమైంది. మన్మథుడు సినిమా ఫ్యాన్స్ మన్మథుడు సినిమా పేరు చెడగొట్టేలా మన్మథుడు2 సినిమా ఉందని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. 
 
మన్మథుడు సినిమాలో అన్ని పాటలు సంగీత ప్రియుల్ని ఆకట్టుకోగా మన్మథుడు2 సినిమాలో ఒక్క పాట కూడా ఆకట్టుకునే విధంగా లేదు. మన్మథుడు2 సినిమాకు క్రిటిక్స్ నుండి యావరేజ్ రివ్యూలు వచ్చాయి. మొదటి రోజు వసూళ్ళు బాగానే ఉన్నప్పటికీ వీకెండ్ తరువాత ఈ సినిమా రాబట్టే కలెక్షన్లను బట్టి ఈ సినిమా తుది ఫలితం ఏంటో చెప్పవచ్చు. సాహో సినిమా వరకు పెద్ద సినిమాలేవీ లేకపోవటం మన్మథుడు2 సినిమాకు కలిసొస్తుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: