రేలంగి... ఈ పేరు ప్రతి ఒక్కరికి సుపరిచితమే.  పాత సినిమాల్లో రేలంగి అంటే ఒక మంచి పేరు ఉన్నది.  అయన సినిమాలు నవ్వించే విధంగా ఉంటాయి.  నవ్వులు మారుపేరు రేలంగి.  సినిమాల్లోకి వచ్చిన కొత్తల్లో చాలా ఇబ్బందులు పడ్డారు. నటుడిగా స్థిరపడిన తరువాత రోజుకు రెండు మూడు షిఫ్ట్ ల్లో పనిచేసేవారు.  నటుడిగా కంటే కమెడియన్ గానే ఎక్కువ సినిమాలు చేశారు.  



మాయాబజార్ సినిమాలో ఆయన నటన అమోఘం.  ఒక్క మాయాబజార్ సినిమానే కాదు ఇలాంటి సినిమాలు చాలా ఉన్నాయి.  ప్రతి సినిమాలో తన ప్రత్యేకతను చాటుకున్నాడు.  తన పనిని తాను చేసుకుంటూ పోవడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య.  సినిమాల్లో బాగా బిజీ అయ్యాక సొంతంగా కారు కొనుక్కున్నాడు.  అప్పట్లో కారు కొనుక్కోవడం అంటే చాలా గొప్ప విషయం.  



రోజు షూటింగ్ అయ్యాక... తన కారులో ఇంటికి వెళ్ళేవాడు.  అలా కారులో బయలుదేరి వెళ్లే సమయంలో మాంబళం మాంబళం అని పెద్దగా అరిచేవారట.  అదేంటి సొంత కారులో వెళ్తూ ఆలా కండక్టర్ గా అరవడం ఏంటి అని షాక్ అవుతున్నారా.. అక్కడే ఉన్నది అంతా.  అలా అరిచినపుడు ఆ యూనిట్ లో పనిచేసే ఓ నలుగురైదుగురు సహాయ దర్శకులు తనతో పాటు ఆ కారులో వచ్చేవారట.  




అప్పట్లో సహాయ దర్శకులు పని పూర్తయ్యాక తిరిగి ఇంటికి వెళ్ళడానికి చాలా కష్టపడేవారు.  ఆ కష్టాలను చూసిన రేలంగి తానూ వెళ్లే సమయంలో ఇలా పిలిచేవారట.  ప్రతి రోజు రేలంగి ఇంటికి మాంబళం మీదుగానే ఇంటికి వెళ్లాల్సి వచ్చేది.  అలా వెళ్లే సమయంలో కొంతమందిని అక్కడ డ్రాప్ చేసి వెళ్లేవారు.  అలా డ్రాప్ చేసిన వాళ్ళు ఆయనకు నమస్కారం చేసే వెళ్ళిపోయేవారు.  నలుగురికి సహాయం చేసినపుడు మనకు నలుగురు సహాయం చేస్తారు అన్నది రేలంగి వాదన.  అప్పట్లో స్టార్ నటులు ఎవరు ఇలా చేసేవారు కాదట.  


మరింత సమాచారం తెలుసుకోండి: