ఈమధ్య కాలంలో ఏ సినిమా పై రానన్ని సెటైర్లు 'మన్మథుడు 2’ పై పడుతున్నాయి.  ఒకవిధంగా ఆలోచిస్తే ఈ మూవీలోని బోల్డ్ అడల్ట్ కంటెంట్ ఈ మూవీకి శాపంగా మారింది. చివరకి ఇలాంటి బూతు డైలాగ్స్ ను ఎంజాయ్ చేసే ప్రేక్షకులు కూడ ‘మన్మధుడు 2’ పేరు చెపితే భయపడిపోతున్నారు అంటే ఈ మూవీ ఎలాంటి ఘోరమైన ఫ్లాప్ గా మారిందో అర్ధం అవుతుంది. 

ఇప్పుడు ఈ సినిమా సెగ అనుకోకుండా నాగార్జున భార్య అమలకు తగలడం ఆశ్చర్యంగా మారింది. అన్నపూర్ణ స్టూడియోస్ ట్విట్టర్ హ్యాండిల్ లో  "ఈ వారంతంలో 'ఫన్'టాస్టిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'మన్మథుడు 2' ను మీ దగ్గరలోని థియేటర్లలో చూడండి' అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ను రీట్వీట్ చేస్తూ నాగార్జున భార్య అమల "నవ్వి నవ్వి సీట్ నుంచి పడిపోయా. సినిమాతో లవ్ లో పడిపోయా.  పూర్తిగా న్యూ ఏజ్ ఫిలిం బ్యూటీఫుల్ #మన్మథుడు2" అంటూ తన అభిప్రాయం తెలియచేసింది. 

ఇప్పుడు అమల చేసిన కామెంట్స్ ఆమెకు శాపంగా మారాయి. కొందరు ఆమెను టార్గెట్ చేస్తూ ధియేటర్లలో చాలామంది స్ప్రహ తప్పి పడిపోయారు మీరు గమనించలేదా మేడమ్ అంటూ చురకలు అంటిస్తున్నారు. మరికొందరైతే అమల అక్కినేని గారు ఇంకా పూర్తిగా తెలుగు నేర్చుకున్నట్టు లేదు. సినిమా అంతా అడల్ట్ కంటెంటే ఇదెలా ఫ్యామిలీ ఎంటర్టైనర్ అవుతుంది అంటూ కామెంట్ చేస్తున్నారు. అయితే ఇక్కడ మరికొందరు ఊహించని ట్విస్ట్ ఇస్తూ మీరు చూసింది త్రివిక్రమ్ ‘మన్మథుడు’ అయి ఉంటుంది అంటూ జోక్ చేస్తున్నారు.  అనుకుంటా మేడమ్ గారు.

మరికొందరైతే వ్రాయడానికి ఆస్కారం లేని పదాలను వాడుతూ అమలను టార్గెట్ చేసారు. కొందరు నాగార్జున అభిమానులు ప్రాధేయపడుతూ నాగార్జునను మంచి సినిమాలు తీయమని చెప్పండి కుదరకపోతే ఖాళీగా ఉండమని చెప్పండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ కామెంట్స్ అన్నీ చూస్తుంటే ‘మన్మధుడు 2’ సినిమా చూసిన ప్రేక్షకులు ఎంత అసహానానికి గురి అవుతున్నారో అర్ధం అవుతుంది..  



మరింత సమాచారం తెలుసుకోండి: